న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫాలోఆన్‌లో అత్యధిక సార్లు: అజహర్ రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

IND Vs SA, Ranchi Test: Massive Record For Ruthless Virat Kohli, Now The Indian Captain To Enforce Follow-On Most Times

హైదరాబాద్: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటడంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 335 పరుగుల ఆధిక్యం లభించింది.

దీంతో సఫారీలను కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫాలో ఆన్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధికంగా ప్రత్యర్థి జట్లను ఎక్కువసార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించిన భారత కెప్టెన్‌గా రికార్డుని సొంతం చేసుకున్నాడు.

India vs South Africa, 3rd Test Day 3: తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 ఆలౌట్, ఆధిక్యం 335India vs South Africa, 3rd Test Day 3: తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 ఆలౌట్, ఆధిక్యం 335

అజహరుద్దీన్ రికార్డు బద్దలు

అజహరుద్దీన్ రికార్డు బద్దలు

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా రెండు, మూడో టెస్టుల్లో ఫాలోఆన్‌కు పిలవడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ 8 సార్లు ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, అజహరుద్దీన్‌ తన కెరీర్‌లో ఏడుసార్లు ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు.

ఇది రెండోసారి

ఇది రెండోసారి

మహేంద్ర సింగ్ ధోని ధోని(5), సౌరవ్‌ గంగూలీ(4) ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, ఫాలో ఆన్‌లో విరాట్ కోహ్లీ(ఐదు విజయాలు, రెండు డ్రాలు)గా రికార్డు ఉంది. 1993-94 హోం సిరిస్‌లో తర్వాత వరుసగా ఓ జట్టుని రెండు సార్లు ఫాలో ఆన్ ఆడించడం ఇది రెండోసారి.

రెండు మ్యాచ్‌ల్లో

రెండు మ్యాచ్‌ల్లో

సిరిస్‌లో శ్రీలంకను టీమిండియా రెండు సార్లు ఫాలో ఆన్ ఆడించింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఓ సిరిస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఫాలోఆన్ ఆడటం ఇది రెండోసారి. 2001-02లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా దక్షిణాఫ్రికా తొలిసారి ఓ సిరిస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఫాలోఆన్ ఆడింది.

రెండో స్థానంలో నిలిచిన మ్యాచ్

రెండో స్థానంలో నిలిచిన మ్యాచ్

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సఫారీలు వరుసగా రెండోసారి ఫాలోఆన్ ఆడుతున్నారు. దీంతో పాటు దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ అత్యధిక పరుగుల ఆధిక్యం సాధించిన జాబితాలో తాజా మ్యాచ్‌ రెండో స్థానంలో నిలిచింది. రాంచీలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది.

ఫాలోఆన్‌ ఆరంభంలోనే తడబాటు

ఫాలోఆన్‌ ఆరంభంలోనే తడబాటు

ఈ వరుసలో 2009-10 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ టాప్‌లో నిలిచింది. ఆ మ్యాచ్‌లో భారత్‌కు 347 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక, ఫాలోఆన్‌లో సైతం దక్షిణాఫ్రికా ఆరంభంలోనే రెండు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్‌ డీకాక్‌(5)ను ఉమేశ్‌ యాదవ్‌ బౌల్డ్‌ చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హమ్జా(0)ను షమీ బౌల్డ్‌ చేశాడు.

Story first published: Monday, October 21, 2019, 15:11 [IST]
Other articles published on Oct 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X