న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: పూణె టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ, బద్దలైన రికార్డులివే!

IND vs SA 2nd Test : Kohli Hits Record Breaking 7th Double Century
Ind vs SA Live Score 2nd Test Day 2: Virat Kohli hits 7th double hundred as India near 500

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. 295 బంతుల్లో 28 ఫోర్ల సాయంతో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

టెస్టుల్లో టీమిండియా తరుపున 7 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్ మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టు హోదా కలిగిన ఆరు దేశాలపై డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో పాటు టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

సఫారీ పేసర్ రబాడను ఎగతాళి చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)సఫారీ పేసర్ రబాడను ఎగతాళి చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)

కోహ్లీ డబుల్ సెంచరీ

తాజా డబుల్ సెంచరీతో విరాట్ కోహ్లీ వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలపై డబుల్ సెంచరీ సాధించినట్లైంది. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే విరాట్ కోహ్లీ తన తొలి 41వ టెస్టుల్లో డబుల్ సెంచరీని సాధించపోవడం. ఆ తర్వాత 41 టెస్టుల్లో ఏకంగా 7 డబుల్ సెంచరీలు సాధించాడు.

2016 తర్వాత

2016 తర్వాత

2016 తర్వాత నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్నాడు. దక్షిణాఫ్రికా డబుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. భారత్ తరుపున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

81 టెస్టుల్లోనే 7 డబుల్ సెంచరీలు

విరాట్ కోహ్లీ కేవలం 81 టెస్టుల్లోనే 7 డబుల్ సెంచరీలు సాధించడం విశేషం. వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం 104 టెస్టులాడి 6 డబుల్ సెంచరీలు సాధంచగా.... సచిన్ టెండూల్కర్ మొత్తం 200 టెస్టులాడి 6 డబుల్ సెంచరీలు సాధించారు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.

అగ్రస్థానంలో డబుల్ సెంచరీ

అగ్రస్థానంలో డబుల్ సెంచరీ

డాన్ బ్రాడ్ మన్(12) డబుల్ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.... కుమార సంగక్కర(11), బ్రియానా లారా(9) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(7) డబుల్ సెంచరీతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

బ్రాడ్ మన్ రికార్డు బద్దలు

కోహ్లీకి కంటే ముందు ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. పూణె టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్(6996) పరుగుల రికార్డుని కూడా అధిగమించాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

నాలుగో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యం

కోహ్లీ, రహానే(59)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానే హాఫ్ సెంచరీ తర్వాత మహారాజ్‌ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 149 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 530 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(216), జడేజా(58) పరుగులతో ఉన్నారు.

1
46114
Story first published: Friday, October 11, 2019, 15:13 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X