న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Sa 2nd ODI; సెంచరీతో ‘శ్రేయస్’కరంగా గెలిపించిన అయ్యార్.. పాపం ఇషాన్..!

shreyas iyer

రాంచీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సౌతాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. వన్డేల్లో తనదైన మాస్టర్ క్లాస్ ఫామ్ కొనసాగించిన శ్రేయస్ అయ్యార్.. పద్ధతైన సెంచరీతో మెరిసిన వేళ ఇండియా సిరీస్ 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 278పరుగులు చేయగా.. 279పరుగుల లక్ష్యాన్ని మరో 25బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌లో 279పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించిందంటే అందుకు ప్రధానంగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ కారణం. ఇషాన్ కిషన్ (93పరుగులు 84బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు), శ్రేయస్ అయ్యార్ (113పరుగులు 111బంతుల్లో 15ఫోర్లు నాటౌట్) వీరిద్దరు ఫుల్ షాట్లు, కట్ షాట్లు, కవర్ డ్రైవ్స్ ఇలా రకరకాల షాట్లు ఆడుతూ సౌతాఫ్రికా బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కుదురుకున్నాక రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంటూ దంచికొట్టారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫార్చున్ 1, రబాడ 1, పార్నెల్ 1 వికెట్లు తీశారు.

ఓ పద్దతిగా లాక్కెళ్లిన శ్రేయస్, ఇషాన్

ఓ పద్దతిగా లాక్కెళ్లిన శ్రేయస్, ఇషాన్

279 పరుగుల లక్ష్య ఛేదనలో.. భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధావన్ (13పరుగులు) పార్నెల్ వేసిన 6వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (28పరుగులు 26బంతుల్లో 5ఫోర్లు ) ఉన్నంత కాసేపు క్లాసిక్ షాట్లతో అలరించాడు. అయితే రబాడా కాట్ అండ్ బౌల్ క్యాచ్ పట్టి గిల్‌ను పెవిలియన్ పంపించాడు. ఇక 48పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇండియాను.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ ఓ పద్ధతిగా లాక్కొచ్చారు. ఇషాన్ కుదురుకునేదాకా కుదురుగా ఆడుతూ.. శ్రేయస్ అయ్యార్‌కు స్ట్రైక్ ఇవ్వగా అతను అడపాదడపా బౌండరీలు బాదుతూ రన్ రేట్ పెరగకుండా చూసుకున్నాడు. అయితే 18ఓవర్లకు స్కోరు 2వికెట్లు కోల్పోయి 85పరుగులకు చేరుకుంది.

మహరాజ్, నార్జ్ బౌలింగ్లో దులిపిన ఇషాన్

మహరాజ్, నార్జ్ బౌలింగ్లో దులిపిన ఇషాన్

ఇక డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇషాన్ తన బ్యాట్ దులుపుడు మొదలెట్టాడు. కేశవ్ మహరాజ్ వేసిన 19వ ఓవర్లో సిక్స్ కొట్టిన ఇషాన్.. 21వ ఓవర్లో రెండు సిక్సులు బాది స్కోరు బోర్డుకు ఊపుతెచ్చాడు. ఆ తర్వాత మూడు ఓవర్లలో ప్రతి ఓవర్లో ఒక్కో బౌండరీ బాది శ్రేయస్ అయ్యార్ సైతం తన క్లాస్ కొనసాగించాడు. ఈ క్రమంలో 26వ ఓవర్లో వీరిద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇషాన్ కిషన్‌కు ఇది మూడో వన్డే హాఫ్ సెంచరీ. 27వ ఓవర్ ముగిసేసరికి స్కోరు 150 దాటింది. అలాగే వీరిద్దరి భాగస్వామ్యం కూడా 100పరుగులు పూర్తయింది. అన్రిచ్ నార్జ్ వేసిన 32వ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదిన ఇషాన్ తన ఫుల్ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. అయితే తర్వాత రబాడ ఓవర్లో మోచేతికి బాల్ తాకడంతో కాసేపు స్ట్రగుల్ అయ్యాడు. అయినప్పటికీ మరో సిక్స్ కొట్టి 90లోకి వచ్చిన ఇషాన్ ఈజీగా సెంచరీ చేస్తాడనుకుంటే.. ఫార్చున్ బౌలింగ్లో హిట్ చేయగా.. బంతి ఫ్లాట్‌గా వెళ్లింది. హెండ్రిక్స్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో 93పరుగుల వద్ద అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఔటయ్యాక క్రీజులో కాసేపు డీలాగా కూర్చుని.. బాధతో ఇషాన్ పెవిలియన్ వెళ్లడం సహచరులతో పాటు ప్రేక్షకులను కూడా కాస్త బాధించింది. అయినప్పటికీ అతని నాక్ పట్ల ప్రేక్షకులు భారీ చప్పట్లతో అభినందించారు.

ఎల్బీడబ్ల్యూ గండం నుంచి గట్టెక్కి..

ఎల్బీడబ్ల్యూ గండం నుంచి గట్టెక్కి..

అప్పటికే కిషన్‌తో 151పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శ్రేయస్ అయ్యార్.. ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టచ్‌లో కన్పించాడు. ఇక కిషన్ ఔటయ్యాక సంజూ శాంసన్ (30పరుగులు 36బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్ నాటౌట్)తో ఇన్నింగ్స్ నడిపించాడు. 80పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ గండం నుంచి గట్టెక్కినా శ్రేయస్.. ఆ తర్వాత మరో ఛాయిస్ ఇవ్వలేదు. ఇక 98పరుగుల వద్ద ఉన్నప్పుడు 43వ ఓవర్లో రబాడా నోబాల్ వేయడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఇక ఫ్రీ హిట్ బంతిని ఫోర్ బాదిన తన సెంచరీని శ్రేయస్ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యార్‌కు ఇది రెండో సెంచరీ. ఆ ఓవర్లో శాంసన్ కూడా సిక్స్ బాదాడు. దీంతో 14పరుగులొచ్చాయి. అప్పటికే గెలుపు అంతరం బాగా తగ్గిపోయింది. ఇక 46వ ఓవర్లో శాంసన్ ఓ ఫోర్ బాదగా.. శ్రేయస్ చివరికి ఫోర్ బాది విజయలాంఛనాన్ని ముగించాడు.

రీజా హెండ్రిక్స్, మార్కరమ్ హాఫ్ సెంచరీలతో..

రీజా హెండ్రిక్స్, మార్కరమ్ హాఫ్ సెంచరీలతో..

ఇక అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేశారు. దక్షిణాప్రికా ప్లేయర్లలో రీజా హెండ్రిక్స్ (74పరుగులు 76బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్), ఐడెన్ మార్కరమ్ (79పరుగులు 89బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 3, వాషింగ్టన్ సుందర్ , షాబాజ్ అహ్మద్ , కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు. సిరాజ్ తన 10ఓవర్ల కోటాలో 3వికెట్లు తీసి ఒక మెయిడిన్ సహా 38పరుగులు మాత్రమే ఇచ్చాడు.

తుది జట్లు:

తుది జట్లు:

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్

సౌతాఫ్రికా: జన్నెమన్ మలాన్, క్వింటన్ డి కాక్(కీపర్), రిజా హెన్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్‌ మహరాజ్, ఫర్చ్యూన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్

Story first published: Monday, October 10, 2022, 7:14 [IST]
Other articles published on Oct 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X