న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బూమ్ బూమ్ బుమ్రా - ఫిట్‌నెస్ ఒట్టి డొల్ల..!!

IND vs SA 2022 2nd T20I: He will play IPL 2023, Twitter flooded over Jasprit Bumrahs ruled out

ముంబై: ఇంకొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు టీమిండియా బౌలింగ్ బ్యాక్‌బోన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాక్ పెయిన్‌ బారిన పడటం ఊహించని ఎదురు దెబ్బ. వెన్నెముకలో ఫ్రాక్చర్ వల్ల అతను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యాడు. దీనితో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ నుంచీ వైదొలిగాడు. ఇది ఏ మాత్రం ఊహించని పరిణామం. గాయం వల్ల స్టార్ పేసర్ దూరం కావడం- జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

సిరాజ్‌కు ఛాన్స్..?

అతని స్థానంలో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కుతుందనే సమాచారం ఉంది. మరో పేస్ బౌలర్ మహ్మద్ షమీ పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తోన్నారు. బుమ్రా వెన్నెముక ఫ్రాక్చర్‌ బారిన పడినట్టు సమాచారం అందిన కొద్దిసేపటికే- షమీ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. సీనియర్ కావడం వల్ల సెలెక్టర్లు షమీ వైపే మొగ్గు చూపొచ్చు. అదే జరిగితే- సిరాజ్‌కు టీ20 ప్రపంచకప్ ఆడే ఛాన్స్ దక్కనట్టే.

వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ..

వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడు. సర్జరీ చేయించుకుంటే మాత్రం బెడ్ రెస్ట్ అవసరమౌతుంది. కనీసం ఆరు నెలల పాటు అతను క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి రావొచ్చు. ఈ ఆరు నెలల వ్యవధిలో జరిగే ఏ సిరీస్‌కు కూడా ఈ స్టార్ పేస్ బౌలర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఎంత మాత్రం లేవు. స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానమే.

ఫ్యాన్స్ ఫైర్..

కాగా- అత్యంత కీలకమైన టీ20 ప్రపంచకప్‌ 2022కు బుమ్రా అందుబాటులో లేకపోవడం పట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతనిపై ట్రోల్స్ చేస్తోన్నారు. సెటైర్లు సంధిస్తోన్నారు. టీ20 ప్రపంచకప్‌కు అతను దూరమైనప్పటికీ- ఐపీఎల్ 2023కి మాత్రం అందుబాటులో ఉంటాడంటూ జోస్యం చెబుతున్నారు. దేశం తరఫున ఆడే మ్యాచ్‌ల కంటే కోట్లాది రూపాయలను గుమ్మరించే ఐపీఎల్‌లో ఆడటానికే అతను ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఫిట్‌నెస్ డొల్ల..

ఐపీఎల్‌లో ఏకధాటిగా 14 టీ20 మ్యాచ్‌లను ఆడే సత్తా ఉన్న ప్లేయర్ల.. దేశం తరఫున ఎందుకు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొనసాగలేకపోతోన్నారని ప్రశ్నిస్తోన్నారు. జాతీయ జట్టులో ఆడటం కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోన్నారనేది ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమౌతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. టీ20 ప్రపంచకప్ కంటే బుమ్రా‌కు ఐపీఎల్‌ ఎక్కువైందంటూ ఆరోపిస్తోన్నారు. బుమ్రా ఫిట్‌నెస్ అంతా ఒట్టి డొల్లగానే కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తోన్నారు.

Story first published: Friday, September 30, 2022, 8:20 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X