జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే అనుకుంటే- పప్పులో కాలేసినట్టే..!!

ముంబై: ఇంకొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు టీమిండియా బౌలింగ్ బ్యాక్‌బోన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాక్ పెయిన్‌ బారిన పడటం ఊహించని ఎదురు దెబ్బ. వెన్నెముకలో ఫ్రాక్చర్ వల్ల అతను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యాడు. దీనితో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ నుంచీ వైదొలిగాడు. ఇది ఏ మాత్రం ఊహించని పరిణామం. గాయం వల్ల స్టార్ పేసర్ దూరం కావడం- జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

సర్జరీ చేయించుకోవడానికే..

సర్జరీ చేయించుకోవడానికే..

వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడు. సర్జరీ చేయించుకుంటే మాత్రం బెడ్ రెస్ట్ అవసరమౌతుంది. కనీసం ఆరు నెలల పాటు అతను క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి రావొచ్చు. ఈ ఆరు నెలల వ్యవధిలో జరిగే ఏ సిరీస్‌కు కూడా ఈ స్టార్ పేస్ బౌలర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఎంత మాత్రం లేవు. స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానమే.

 బుమ్రా ఒక్కడే కాదుగా

బుమ్రా ఒక్కడే కాదుగా

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి వైదొలగిన టీమిండియా ప్లేయర్లల్లో బుమ్రా ఒక్కడే ఉన్నాడనుకుంటే పొరపాటు పడ్డట్టే. పప్పులో కాలేసినట్టే. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే దూరమైన విషయం తెలిసిందే. ఆసియా కప్ 2022 టోర్నీ సందర్భంగా అతను గాయపడ్డాడు. ఇటీవలే ఈ స్టార్ ఆల్‌రౌండర్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. తాను క్రమంగా కోలుకుంటోన్నట్లు జడేజా చెప్పాడు. దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని అతను తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఆల్‌రౌండర్ జడేజా..

ఆల్‌రౌండర్ జడేజా..

టీ20 ఫార్మట్ స్పెషలిస్ట్ రవీంద్ర జడేజా. బంతితోపాటు బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో అతను గాయపడ్డాడు. మోకాలికి గాయం కావడంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీని తరువాత రవీంద్ర జడేజా మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. కనీసం ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమైందతనికి.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్..

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్..

ఫలితంగా- ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరం అయ్యాడు. టీ20 ప్రపంచకప్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా వంటి నిలకడగా రాణించే సత్తా ఉన్న ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడమే పెద్ద లోటుగా భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా గాయపడటం శరాఘాతంలా పరిణమించింది. బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేసినా.. అది అతని స్థాయిని అందుకోలేదనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఆ స్థాయి బౌలర్‌తో నో రీప్లేస్‌మెంట్..

ఆ స్థాయి బౌలర్‌తో నో రీప్లేస్‌మెంట్..

ఆస్ట్రేలియా గడ్డ మీద జస్‌ప్రీత్ బుమ్రాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు మీద, ఆ దేశంలో జరిగిన టోర్నమెంట్లల్లో అతను నిలకడగా రాణించిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. అలాంటి బుమ్రాకు రిప్లేస్‌మెంట్ అనేది కష్టమే. కొందరు మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఆస్ట్రేలియాలో వరల్డ్ నంబర్ వన్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న బుమ్రాకు బీసీసీఐ సెలెక్టర్లు అదే స్థాయి ప్లేయర్‌తో రీప్లేస్ చేయలేకపోవచ్చని స్పష్టం చేస్తోన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 30, 2022, 9:06 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X