న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు.. గంభీర్ కెరీర్‌ను నేనే ముగించా!!

IND vs PAK: I ended Gautam Gambhirs career said Pakistan pacer Mohammad Irfan

కరాచీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంబీర్ గురించి పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. గంబీర్ కెరీర్‌ను ఒకవిధంగా నేనే ముగించా అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. 2017లో పీసీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలలో చిక్కుకుని ఇర్ఫాన్‌ నిషేధం ఎదుర్కొన్నాడు. నిషేధం తర్వాత ఇర్ఫాన్‌ తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. గత ప్రపంచకప్‌లో కూడా అతనికి స్థానం దక్కలేదు. అయితే ప్రస్తుతం జట్టులోకి రావడానికి ఏడు అడుగులు ఉండే ఇర్ఫాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

<strong>ప్రముఖ హోటల్లో డిన్నర్ డేట్.. రాహుల్-అతియాల ప్రేమాయ‌ణం నిజమేనా?</strong>ప్రముఖ హోటల్లో డిన్నర్ డేట్.. రాహుల్-అతియాల ప్రేమాయ‌ణం నిజమేనా?

2013లో చివరి వన్డే

2013లో చివరి వన్డే

2010లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఇర్ఫాన్ అరంగేట్రం చేశాడు. మంచి ఎత్తు ఉండడంతో బౌన్స్‌తో బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించేవాడు. 2012లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో గౌతం గంభీర్‌ను ఇర్ఫాన్ ఎక్కువ సార్లు ఔట్‌ చేశాడు. ఆ సిరీస్‌లో వన్డే, టీ20ల్లో కలిపి గంభీర్‌ను నాలుగు సార్లు పెవిలియన్ చేర్చాడు. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో గంభీర్ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక 2013 జనవరిలో ఇంగ్లాండ్‌తో చివరి వన్డే ఆడాడు.

నా కళ్లలోకి చూడటానికి భయపడేవాడు

నా కళ్లలోకి చూడటానికి భయపడేవాడు

తాజాగా పాకిస్తాన్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహమ్మద్ ఇర్ఫాన్ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నాడు. ఇర్ఫాన్ మాట్లాడుతూ... 'భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు ఆడినప్పుడు బ్యాట్స్‌మన్‌ నన్ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నా ఎత్తు కారణంగా నేను వేసే బంతుల్ని సరిగా అంచనా వేయలేకపోయేవారు. ఇక గంభీర్‌ అయితే నా కళ్లలోకి చూడలేకపోయేవాడు. నా కళ్లలోకి చూడటానికి భయపడేవాడు. రెండు జట్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో ఉన్నప్పుడు కూడా నా కళ్లలోకి చూసేవాడు కాదు' అని ఇర్ఫాన్ అన్నాడు.

కోహ్లీ కూడా ఇబ్బందిపడ్డాడు

కోహ్లీ కూడా ఇబ్బందిపడ్డాడు

'2012 సిరీస్‌లో నేను గంభీర్‌ను నాలుగుసార్లు ఔట్ చేశా. ఆ సిరీస్‌ తర్వాత గంభీర్‌కు జట్టులో అవకాశాలు అంతగా రాలేదు. అనంతరం గంభీర్‌ ఒకే సిరీస్‌ ఆడినట్లు నాకు గుర్తు. నా కారణంగానే అతని కెరీర్‌ ముగిసిందని అనుకుంటున్నా. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఇబ్బందిపడ్డాడు. 130-135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తా అనుకున్నాడు. కానీ 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశా. మరొ చివరలో ఉన్న యువరాజ్ సింగ్ కూడా నా బౌలింగ్‌లో షాట్లు ఆడొద్దని కోహ్లీకి పంజాబీలో చెప్పాడు' అని ఇర్ఫాన్ తెలిపాడు.

Story first published: Monday, October 7, 2019, 13:06 [IST]
Other articles published on Oct 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X