న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: మూడేళ్ల తర్వాత సెంచరీ.. ఇక దబిడి దిబిడే అంటున్న రోహిత్ ఫ్యాన్స్!

IND vs NZ: Fans reactions after Rohit Sharma scores an ODI hundred after 3 years

ఇండోర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు వన్డే ఫార్మాట్‌లో సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించాడు. న్యూజిల్యాండ్‌తో మూడో వన్డేలో రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగాడు. 2020 జనవరి 19న ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా చివరి వన్డే సెంచరీ సాధించిన రోహిత్ మళ్లీ ఇన్నాళ్లకు మూడెంకల స్కోర్ నమోదు చేశాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి బంతి నుంచే విరుచుకుపడిన రోహిత్.. 83 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ఒక్కొక్కడికి దబిడి దిబిడే..

ఇక రోహిత్ శర్మ సెంచరీ సాధించడంపై అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా సెంచరీ కోసం ఎదురు చూస్తున్న తమకు ఈ రోజు ఆ కోరిక నెరవేరిందని కామెంట్ చేస్తున్నారు. గతేడాది పేలవ ఫామ్‌తో తడబడిన రోహిత్.. ఈ ఏడాది సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడని, సెంచరీకి ముందు ఆడపా దడపా హాఫ్ సెంచరీలు బాదిన అతను.. సెంచరీ చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని ముందు ముందు డబుల్ సెంచరీలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడని కామెంట్ చేస్తున్నారు.

కన్నీళ్లు ఆగలేదు..

రోహిత్ సెంచరీ చేసిన క్షణం తమ కంట కన్నీరు వచ్చాయని ఫ్యాన్స్ భావోద్వేగపూరిత కామెంట్స్ చేస్తున్నారు. డేంజరస్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడని ప్రత్యర్థి జట్ల బౌలర్లుగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది వన్డేలు మాత్రమే ఆడనున్న రోహిత్.. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చుక్కలు చూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ పోరాట పటిమ ఎంతో స్పూర్తిదాయకమని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ప్రయత్నాన్ని విరమించవద్దని రోహిత్ తన సెంచరీతో చాటి చెప్పాడని ట్వీట్ చేస్తున్నారు.

రికీ పాంటింగ్ సరసన..

ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో రోహిత్.. రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. 365 ఇన్నింగ్స్‌ల్లో రికీ పాంటింగ్ 30 సెంచరీలు బాదగా.. రోహిత్ శర్మ 234 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 49(452 ఇన్నింగ్స్‌ల్లో) సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 46 (261 ఇన్నింగ్స్‌ల్లో) సెంచరీలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందే సెంచరీ చేస్తానని చెప్పిన రోహిత్.. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

కివీస్ ముందు భారీ లక్ష్యం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మకు తోడుగా శుభ్‌మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113) సెంచరీతో చెలరేగాడు. చివర్లో హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్‌నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ధీటుగా బదులిస్తోంది. డెవాన్ కాన్వే సూపర్ సెంచరీతో 27 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసుకుంది.

Story first published: Tuesday, January 24, 2023, 20:22 [IST]
Other articles published on Jan 24, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X