న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీసా గడువు ముగిసినా భారత్‌లోనే: బంగ్లా క్రికెటర్‌కు జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం

IND vs BAN: Reserve opener Saif Hassan pays Rs 21,600 penalty for overstaying in India

హైదరాబాద్: భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన ముగిసినప్పటికీ రెండు రోజుల పాటు ఉండటంతో బంగ్లాదేశ్ రిజర్వ్ ఓపెనర్ సైప్ హాసన్ రూ.21,6000లను జరిమానాగా చెల్లించాడు. వీసా ముగిసినప్పటికీ భారత్‌లో ఉన్నందుకు గాను కేంద్ర విమానయాన శాఖ అతడికి ఈ జరిమానా విధించింది.

గత నెలలో బంగ్లాదేశ్ జట్టు మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు భారత దేశానికి వచ్చింది. గత ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టుతో భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ధోనితో పోల్చుకుని ఒత్తిడికి గురవుతున్న పంత్: అసలు విషయం వెల్లడించిన ఎమ్మెస్కేధోనితో పోల్చుకుని ఒత్తిడికి గురవుతున్న పంత్: అసలు విషయం వెల్లడించిన ఎమ్మెస్కే

రెండు రోజుల పాటు ఆలస్యంగా

రెండు రోజుల పాటు ఆలస్యంగా

ఆ మరుసటి రోజైన సోమవారం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఢాకాకు బయల్దేరి వెళ్లింది. భారత్‌లో రెండు రోజుల పాటు ఉండేందుకు గాను ఢాకాలోని భారత హైకమిషన్ అతడి వీసాను రెండు రోజుల పాటు పొడిగించింది. అయితే, వీసా పొడిగించినా... కొన్ని గంటలు భారత్‌‌లో అదనంగా ఉండటంతో అతడికి ఈ జరిమానా విధించారు.

రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికైన సైప్ హాసన్

రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికైన సైప్ హాసన్

భారత పర్యటనలో భాగంగా సైప్ హాసన్ బంగ్లాదేశ్ జట్టు తరుపున రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతడి వీసా ఆదివారం అర్ధరాత్రి వరకు చెల్లుతుంది, వీసా గడువు ముగిసినట్లు హసన్ లేదా బంగ్లాదేశ్ వైపు లాజిస్టిక్స్ విభాగం గుర్తించక పోవడం విశేషం.

వీసా ముగిసినప్పటికీ

వీసా ముగిసినప్పటికీ

గతంలో వీసా ముగిసినా కొన్ని గంటల పాటు భారత్‌లో ఉన్నప్పటికీ జరిమానా విధించేవారు కారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీసా గడువు ముగిసి తర్వాత కొన్ని గంటల పాటు భారత్‌లో ఉన్నా జరిమానా విధించేలా మార్పులు చేసింది. ఇందుచేతనే కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విమానాశ్రయ అధికారులు అతడికి జరిమానా విధించారు.

2-0తో టెస్టు సిరిస్ క్లీన్ స్వీప్

2-0తో టెస్టు సిరిస్ క్లీన్ స్వీప్

భారత పర్యటనలో మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కోల్పోయిన బంగ్లాదేశ్... ఆ తర్వాత జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో కోల్పోయింది. ఈ రెండు టెస్టుల్లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం విశేషం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు.

Story first published: Thursday, November 28, 2019, 13:28 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X