న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆసిస్: గత రికార్డులను ప్రస్తావించి భారత్ ఫేవరేట్ కాదన్న గిల్‌క్రిస్ట్

Ind vs Aus: Dont think India will start as favorites given their past record in Australia, reckons Gilchrist

హైదరాబాద్: గత పర్యటనల్లో టీమిండియా రికార్డులను పరిశీలిస్తే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌‌ని గెలిచే అవకాశాలు తక్కువేనని ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబరు 6న ఆడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఆసీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్: మెరిసిన షా, కోహ్లీ.. భారత్ 358‌ ఆలౌట్ఆసీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్: మెరిసిన షా, కోహ్లీ.. భారత్ 358‌ ఆలౌట్

సుదీర్ఘకాలంగా టెస్టు క్రికెట్ ఆడుతోన్న ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేకపోయింది. 2003-04 పర్యటనలో గంగూలీ నాయకత్వంలోని టీమిండియా టెస్టు సిరిస్ డ్రా చేసుకోగా, ఆ తర్వాత 2007-08లో జరిగిన టెస్టు సిరిస్‌లో ధోని సేన 2-1తేడాతో సిరిస్‌ను కోల్పోయింది.

2014-15లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ధోనిసేన

2014-15లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ధోనిసేన

మళ్లీ 2014-15లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ధోని నాయకత్వంలోని టీమిండియా 2-0తో టెస్టు సిరిస్‌లో ఓడిపోయింది. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు బాదినప్పటికీ జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు టీమిండియా మంచి సమతూకంతో ఉండటం, మరోవైపు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.

 కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా

ఈ క్రమంలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా గత రికార్డులను గుర్తు చేసిన గిల్‌క్రిస్ట్ ఈ సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్ కాదని తేల్చిచెప్పాడు.

టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు ఫేవరెట్ కాదు

టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు ఫేవరెట్ కాదు

ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ మాట్లడుతూ "టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు ఫేవరెట్ కాదు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో గెలుపొందడం చాలా కష్టమని గత చరిత్ర చెప్తోంది. ఆ రికార్డుల్ని పరిశీలిస్తే.. భారత్ జట్టు ఎంతమాత్రం సిరీస్‌లో ఫేవరెట్ కాదు" అని గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు.

భారత్ టెస్టు జట్టు:

భారత్ టెస్టు జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Thursday, November 29, 2018, 14:05 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X