న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రాహుల్‌ను జట్టు నుంచి వేటు వెయ్యండి'

IND vs AUS, 1st Test: If KL Rahul fails to score in second innings he should be dropped, says Sunil Gavaskar

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విఫలమైతే అతనికి అవకాశమివ్వొద్దని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 2 పరుగులకే పేలవ రీతిలో ఔటవ్వడంతో రెండో టెస్టులో అతనిని జట్టులోకి తీసుకోవద్దంటూ సెలక్షన్ కమిటీకి సలహాలిస్తున్నాడు.

ఫించ్‌కి సులువైన క్యాచ్ ఇచ్చిన రాహుల్

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని వెంటాడిన రాహుల్.. థర్డ్ స్లిప్‌లో ఫీల్డర్ అరోన్ ఫించ్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో రాణిస్తాడని భావించి ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై అవకాశం కల్పించినా ఫెయిలైయ్యాడు కేఎల్ రాహుల్. ఇదే విధంగా వెస్టిండీస్‌తో ముగిసిన 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ విఫలమైన విషయం తెలిసిందే.

క్రీజులో కుదురుకోనివ్వని షాట్ సెలక్షన్స్

క్రీజులో కుదురుకోనివ్వని షాట్ సెలక్షన్స్

అడిలైడ్ టెస్టు‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కేఎల్ రాహుల్ ఫెయిలైతే.. అతడ్ని రెండో టెస్టు నుంచి తప్పించాలి. ఎందుకంటే.. వరుసగా విఫలమవుతుండటంతో ఇప్పుడు అతనిలో ఏమాత్రం ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని వెంటాడటం అతని బలహీనతగా మారిపోయింది. దీనికి తోడు.. పేలవ షాట్ సెలక్షన్‌ అతడ్ని క్రీజులో కుదురుకోనివ్వడం లేదు. కనీసం ఇప్పటికైనా.. తప్పిదాలను దిద్దుకోవాలనే ఆలోచన అతనికి ఉన్నట్లు నాకు అనిపించడం లేదు

ఇంత నాసిరకంగా ఔటవుతారా?

ఇంత నాసిరకంగా ఔటవుతారా?

ఒక టెస్టు మ్యాచ్‌కు ఆడేటప్పుడు ఇలాగేనా ఆడేది. ఔట్ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతులకు వికెట్లు సమర్పించుకుంటారా?. వదిలేయాల్సిన బంతులపైకి వెళ్లి మరీ వికెట్లు చేజార్చుకోవడమేంటి. కోకోబుర్రా బంతులు కేవలం కొన్ని ఓవర్లు పాటే స్వింగ్‌ కావడానికి సహకరిస్తాయి. అటువంటప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మానేసి ఇంత నాసిరకంగా ఔటవుతారా?

1
43623
Story first published: Friday, December 7, 2018, 11:18 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X