న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్xపాక్ మ్యాచ్: టీమిండియాకే ప్రత్యేక సదుపాయం?

Asia Cup 2018 : Ind-Pak Match Favours To Team India More..??
In Stats: India Hold Edge After Recent Domination of Pakistan

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా భారత జట్టు అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుండడాన్ని పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ తప్పుపట్టాడు. ఇతర జట్లన్నీ అబుదాది, దుబాయ్‌లలో మ్యాచ్‌లు ఆడుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. నిబంధనలు అన్ని జట్లకు ఒకేలా ఉండాలని అన్నాడు. అయితే భారత జట్టు దుబాయ్‌లోనే ఆడించడంపై ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకి వ్యాపార ప్రయోజనాలున్నాయి.

దుబాయ్‌ స్టేడియం కెపాసిటీ

దుబాయ్‌ స్టేడియం కెపాసిటీ

పాక్‌, బంగ్లాదేశ్‌ జట్లతో భారత జట్టు ఆడినప్పుడు అబుదాబి స్టేడియం (20వేలు)కంటే ఎక్కువ (25వేలు) కెపాసిటీ ఉన్న దుబాయ్‌ స్టేడియం ఫుల్‌ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆసియా కప్‌ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొద్దిగంటల్లోనే ప్రారంభంకానుంది.

గంగూలీ లాంటి వారు భారత్‌కి అండగా

గంగూలీ లాంటి వారు భారత్‌కి అండగా

దుబాయ్ వేదికగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ పోరు జరగనుండగా.. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు మ్యాచ్ ఫలితంపై అంచనా వేసేశారు. ఈ జాబితాలో ఎక్కువ మంది అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్‌‌‌కి మద్దతుగా నిలవగా.. సౌరవ్ గంగూలీ లాంటి వారు భారత్‌కి అండగా నిలిచారు. ఏది ఏమైనా ఈ దాయాది పోరు.. అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టడడం ఖాయంగా కనిపిస్తోంది.

గతంలో భారత్, పాకిస్థాన్ 12 మ్యాచ్‌లు:

గతంలో భారత్, పాకిస్థాన్ 12 మ్యాచ్‌లు:

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చి రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. గతంలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ ఆరింటిలో గెలుపొంది.. ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ దాయాది దేశాలు చివరిసారి తలపడగా.. అందులో పాకిస్థాన్ 180 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

 బదులు తీర్చుకోవాలనే కసిలో భారత్

బదులు తీర్చుకోవాలనే కసిలో భారత్

ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్‌కే మెరుగైన రికార్డు ఉంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ టోర్నీలో టీమిండియా ఆరు సార్లు విజేతగా నిలవగా.. పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే కప్ గెలిచింది. 2009 నుంచి యూఏఈని సొంత వేదికగా చేసుకుని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న పాకిస్థాన్‌కి అక్కడి పిచ్‌లు కొట్టినపిండి.. దీనికి తోడు కోహ్లీ భారత జట్టులో లేకపోవడంతో అందరూ పాక్‌నే ఫేవరెట్‌గా అంచనా వేస్తుండానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పిచ్‌, వాతావరణం, జరిగే సమయం:

పిచ్‌, వాతావరణం, జరిగే సమయం:

టోర్నీలో భాగంగా భారత్.. పాక్‌లకు మధ్య బుధవారం సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్‌ అన్ని మ్యాచ్‌లను ఇక్కడే ఆడనుంది. చివరి మ్యాచ్‌లాగే బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరగగా.. ఆరింటిలో భారత్‌ నెగ్గింది. ఓ మ్యాచ్‌ రద్దయింది. యూఏఈలో పాక్‌తో ఆడిన 26 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచింది ఏడుసార్లు మాత్రమే.

ఆడనున్న జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, ధోనీ, జాదవ్‌, పాండ్యా, కుల్దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌.

పాకిస్థాన్‌: ఇమామ్‌, ఫఖర్‌ జమాన్‌, బాబర్‌ ఆజమ్‌, షోయబ్‌, సర్ఫరాజ్‌ (కెప్టెన్‌), అసిఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌, ఫహీమ్‌ ఆష్రఫ్‌, ఆమెర్‌, హసన్‌ అలీ, ఉస్మాన్‌ ఖాన్‌.

Story first published: Wednesday, September 19, 2018, 15:47 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X