For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంత మైదానంలో విండిస్‌తో ఆఖరి టీ20: రోహిత్ శర్మ ఫామ్ అందుకునేనా?

In excellent year, Rohit Sharma looks to deliver in crunch Mumbai T20I vs West Indies

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు 2019 సంవత్సరం ఓ వరం అనే చెప్పాలి. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు తర్వాత టెస్టుల్లో ఓపెనర్‌గా సెంచరీలు మీద సెంచరీలు బాదాడు. ఈ ఏడాది మొత్తంగా మూడు ఫార్మాట్లలో రెండు వేలకు పైగా పరుగులు చేశాడు.

ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ(2296) అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 2113 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ యావరేజి 50కి పైగా ఉండటం విశేషం. టీ20ల్లో మాత్రం రోహిత్ రికార్డు ఏమంత మెరుగ్గా లేదు.

ఈ ఏడాది ఇప్పటివరకు 13 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 325 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి 25. గత ఆరేళ్లలో రోహిత్ శర్మ ఇంత తక్కువ యావరేజిని కలిగి ఉండటం ఇదే మొదటిసారి. ఈ 13 మ్యాచ్‍‌ల్లో రోహిత్ శర్మ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 50కిపైగా పరుగులు సాధించాడు. అలాగే, 6 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుతో ఔటయ్యాడు.

Story first published: Wednesday, December 11, 2019, 13:03 [IST]
Other articles published on Dec 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+