న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీలా అనుకుంటే మిథాలీకే మద్ధతివ్వాలి కదా మేడమ్!!'

If Virat Kohli can, why not Harmanpreet Kaur: Diana Edulji. Why not Mithali Raj, counters Vinod Rai

ముంబై: భారత మహిళా జట్టు కోచ్ విషయం రోజుకో వివాదాన్ని తెచ్చిపెడుతోంది. మంగళవారం కోచ్‌ను ఎంపిక చేసుకోవడంలో కోహ్లీకి ఇచ్చిన స్వాత్రంత్ర్యం హర్మన్‌ప్రీత్‌కు ఎందుకివ్వడం లేదని క్రికెట్ పాలక మండలి(సీఓఏ) సభ్యురాలు వాదించారు. ఈ క్రమంలో రవిశాస్త్రిని టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడంలో కెప్టెన్‌ కోహ్లీ సలహాను పాటించగా లేనిది.. మహిళల జట్టు కోచ్‌ ఎంపికలో సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వాదనను ఎందుకు పరిగణనలోకి తీసుకోరన్న డయానా ఘాటు ప్రశ్నకు క్రికెట్ పాలక మండలి(సీఓఏ) ఛీఫ్ వినోద్ రాయ్‌ అంతే ధీటుగా బదులిచ్చారు.

మిథాలీరాజ్‌ సూచనను పరిగణనలోకి

మిథాలీరాజ్‌ సూచనను పరిగణనలోకి

‘కోచ్‌ ఎంపికలో సీనియర్‌ క్రికెటర్ల అభిప్రాయాలను గౌరవించాలన్న ఎడుల్జీ వాదన ప్రకారం చూస్తే.. జట్టులో అత్యంత సీనియర్‌‌గా కొనసాగుతున్న మిథాలీరాజ్‌ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా' అంటూ డయానాకు పంపిన ఈమెయిల్‌లో రాయ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అంతకుముందు జరిగిన వాదనలో డయానా.. కోహ్లీ అడిగారని కోచ్‌గా రవిశాస్త్రి దరఖాస్తు గడువును కూడా పెంచారని విమర్శించారు. ఈ క్రమంలో జెంటిల్‌మన్ అయిన అనిల్ కుంబ్లేను సైతం విలన్‌గా చూపించేందుకు వ్యూహాలు రచనలు చేశారని అన్నారు.

మిథాలీని అందరం కావాలనే తప్పించాం

మిథాలీని అందరం కావాలనే తప్పించాం

ఇక మిథాలీ విషయానికొస్తే.. తనను జట్టులో వివక్షకు గురిచేస్తున్నారని సమానంగా చూడటం లేదంటూ సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. మిథాలీని జట్టులో ఎంచుకోకపోవడంలో కోచ్ పొవార్ నిర్ణయమే తుది నిర్ణయం కాదని సమష్టిగానే తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

మిథాలీతో రోజూ మాట్లాడతా

మిథాలీతో రోజూ మాట్లాడతా

వినోద్ రాయ్‌, డయానాల మధ్య మెయిల్‌ల యుద్ధం జరుగుతుండగా.. మొత్తం వివాదానికి కారకుడైన రమేష్‌ పొవార్‌ బుధవారం ఇలా మాట్లాడారు. మిథాలీతో తనకు వివాదం లేదన్నాడు. ‘మిథాలీకి నాకు పొసగడం లేదనడం సరికాదు. మిగతా ప్లేయర్లతోపాటు మిథాలీతో రోజు మాట్లాడుతుంటాను' అని తెలిపాడు. పొవార్.. రెండ్రోజుల ముందు మాట్లాడినప్పడు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు అడిగినందుకు బాగుండదేమోనని మాత్రమే దరఖాస్తు చేశానని పేర్కొన్నాడు.

Story first published: Thursday, December 13, 2018, 11:36 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X