న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాండ్యా చేసిన ఆ సూచన ఆసీస్‌పై భారీ స్కోరుకి నాంది పలికింది'

ICC Cricket World Cup 2019: Virat Kohli Comments On Hardhik Pandya Hitting In Ind VS Aus Match
ICC World Cup 2019: Virat Kohli reveals tactics discussed with Hardik Pandya against Australia

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు కోహ్లీకి హార్దిక్‌ పాండ్యా ఓ సూచన చేశాడంట.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆసీస్‌పై భారీ స్కోరు చేయగలిగాం

ఆసీస్‌పై భారీ స్కోరు చేయగలిగాం

ఈ సూచన వల్లే ఆస్ట్రేలియాపై భారీ స్కోరు చేయగలిగామని కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 77 బంతుల్లో 82 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ మాట్లాడుతూ "నేను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పాండ్యా నా వద్దకు వచ్చి హిట్టింగ్‌ చేస్తానని చెప్పాడు. నన్ను మరో ఎండ్‌లో స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌ తియ్యమని చెప్పాడు" అని అన్నాడు.

పాండ్యా అలా చెప్పడం నచ్చింది

పాండ్యా అలా చెప్పడం నచ్చింది

"పాండ్యా అలా చెప్పడం నాకు నచ్చింది. నేను మరో ఎండ్‌లో ఉంటే తాను స్వేచ్ఛగా ఆడగలనని చెప్పడంతో పాండ్యాకు అవకాశం ఇచ్చాను. పాండ్యా, ధోనీ ఆడుతున్నంత సేపూ నేను సింగిల్స్‌కే పరిమితమయ్యా. వాళ్లు హిట్టింగ్‌ చేస్తూ స్కోరుని పరిగెత్తిస్తుంటే నాకు ఇబ్బంది కలగలేదు. మరో ఎండ్‌లో వికెట్లు కాపాడుకుంటూ సింగిల్స్‌ తీయడంపైనే దృష్టిసారించా" అని కోహ్లీ తెలిపాడు.

పరిస్థితులకు తగట్టు ఆడాం

పరిస్థితులకు తగట్టు ఆడాం

"నిజానికి మిడిలార్డర్‌లో ఎవరెలా ఆడాలో జట్టు మేనేజ్‌మెంట్ ముందే చర్చించింది. పరిస్థితులకు తగట్టు ఆడి పరుగులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకముందు 330 పరుగులు చేసి శ్రీలంక చేతిలో ఓడిపోయాం. కాబట్టి ఈసారి పెద్ద స్కోర్‌ చెయ్యాలని ముందే అనుకున్నాం. అందుకు తగ్గట్టే ధావన్‌ ఔటయ్యాక హార్దిక్‌ను బ్యాటింగ్‌కు పంపించాం" అని కోహ్లీ అన్నాడు.

గురువారం న్యూజిలాండ్‌తో

గురువారం న్యూజిలాండ్‌తో

కాగా, టోర్నీలో భాగంగా టీమిండియా తదుపరి మ్యాచ్‌ గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత జూన్ 16న దాయాది దేశమైన పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధించినట్టే. మరోవైపు ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచింది.

Story first published: Tuesday, June 11, 2019, 16:10 [IST]
Other articles published on Jun 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X