న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC World Cup 2019: వరల్డ్‌కప్‌కు స్టీవ్ స్మిత్ దూరమేనా?

Cricket Analysts Says That It Is Difficult To Play Smith In World Cup | Oneindia Telugu
ICC World Cup 2019: Steve Smith likely to miss the tournament due to lack of cricket

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యారు. వీరిద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధం మార్చి 29తో ముగిస్తుంది. దీంతో జాతీయ జట్టులోకి వీరిద్దరి పునరాగమనంపై అటు అభిమానులతో పాటు ఇటు క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా వారిద్దరూ జట్టులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలుమార్లు వెల్లడించాడు.

ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ

ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ

దీంతో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో స్మిత్, వార్నర్‌లు ఆడటం ఖాయమని అనుకుంటున్న వేళ క్రికెట్ ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వరల్డ్ కప్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)‌లో స్టీవ్‌ స్మిత్ మోచేతికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే.

మోచేతి గాయంతో బాధపడుతున్న స్మిత్‌

మోచేతి గాయంతో బాధపడుతున్న స్మిత్‌

దీంతో చాలా కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న స్మిత్‌ చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి స్మిత్‌కు కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. అయితే, స్మిత్ వరల్డ్‌ కప్‌ కోసం తొందరపడకుండా ఎక్కువ సమయం పట్టినా సరే పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆగాలనే ఆలోచనతో ఉన్నాడు.

వరల్డ్‌ కప్‌ ఆడటం కష్టమే

వరల్డ్‌ కప్‌ ఆడటం కష్టమే

పైగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌పై కూడా నిషేధం ఉండటంతో చాలా కాలంగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు దూరమైన స్మిత్‌ నేరుగా వరల్డ్‌ కప్‌ ఆడటం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఆ సమయంలో స్మిత్ ఇంగ్లాండ్‌ కౌంటీల్లో గానీ, ఆసీస్‌-ఏ తరఫున గానీ ఆడాలని భావిస్తున్నాడు. ఇక, వార్నర్ విషయానికి వస్తే ప్రస్తుతం మోచేతి గాయంనుంచి కోలుకున్నాడు. దీంతో యూఏఈలో పాక్‌తో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చివరి రెండు మ్యాచ్‌లు నిషేధం ముగిసిన తేదీ తర్వాత ప్రారంభం కానున్నాయి.

Story first published: Wednesday, February 6, 2019, 9:12 [IST]
Other articles published on Feb 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X