న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది ఓపెన్ వరల్డ్‌కప్: విశ్వవిజేత ఎవరో చెప్పిన రికీ పాంటింగ్

ICC Cricket World Cup 2019 : Ricky Ponting Picks His Title-Favourites And It's Not Australia !
ICC World Cup 2019: Ricky Ponting picks his title-favourites and its not Australia

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమ తమ బెస్ట్ కాంబినేషన్లతో పాటు గెలుపు ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ప్రపంచకప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి భారత్‌ అని చెప్పిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మలతో పాటు ఉత్తమ ఫినిషర్‌ ధోనీ కూడా జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని తెలిపాడు. తాజాగా ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్‌ కప్‌ అందించిన రికీ పాంటింగ్ కూడా ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

పాంటింగ్ మాట్లాడుతూ

పాంటింగ్ మాట్లాడుతూ

అయితే, ఇంగ్లాండే ఎందుకు తన ఫేవరేటే కూడా పాంటింగ్ వెల్లడించాడు. పాంటింగ్ మాట్లాడుతూ "ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో ఇంగ్లండ్‌ బలంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల అంశం. అదే విధంగా 7వ నెంబర్‌ వరకు దాటిగా బ్యాటింగ్‌ చేయడం కలిసొచ్చే అంశం. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల నుంచి గట్టి పోటీని ఎదురుకునే అవకాశం ఉంది" అని పాంటింగ్ తెలిపాడు.

ఇది ఓపెన్ వరల్డ్‌కప్

ఇది ఓపెన్ వరల్డ్‌కప్

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగడం కూడా ఆతిథ్యజట్టుకు కలిసిరానుంది. ఈ విధానంలో టోర్నీలో పాల్గొనే జట్లు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యనంలో పాకిస్థాన్, వెస్టిండిస్, దక్షిణాఫ్రికా లాంటి జట్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పాంటింగ్ చెప్పాడు. "ఈ జట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఓపెన్ వరల్డ్‌కప్. ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్" అని పాంటింగ్ అన్నాడు.

ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో

ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో

వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్థాన్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో కైవసం చేసుకుని ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్ జట్టలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. ఆదివారం లీడ్స్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఐదు వన్డేల సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఐసీసీ ర్యాంకుల్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు

11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు

యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. 1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు.

రౌండ్ రాబిన్ పద్ధతిలో

రౌండ్ రాబిన్ పద్ధతిలో

అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Monday, May 20, 2019, 19:01 [IST]
Other articles published on May 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X