న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvNZ తొలి సెమీఫైనల్: పోరాడి ఓడిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌

ICC World Cup 2019: India vs New Zealand: Semifinal: Live Score: India, Kiwis look to complete race for final

హైదరాబాద్: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి వరకు పోరాడినా.. కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టగా.. మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది.

కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.

దీని నుంచి తేరుకోకముందే మాట్‌ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. కేఎల్‌ రాహుల్‌ (1; 7 బంతుల్లో)ను హెన్రీ (3.1వ బంతికి) పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో భాద్యతగా ఆడాల్సిన దినేష్ కార్తీక్ (6; 25బంతుల్లో) ఔట్ అయ్యాడు. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో కార్తీక్‌ పెవిలియన్ చేరాడు. అనంతరం రిషభ్‌ పంత్‌ (32; 56 బంతుల్లో 4×4) శాంట్నర్‌ వేసిన 22.5వ బంతిని షాట్ ఆడి గ్రాండ్‌హోమ్‌కి చిక్కాడు.

శాంట్నర్‌ వేసిన 30.3వ బంతికి హార్దిక్‌ పాండ్యా (32; 62 బంతుల్లో 2×4) భారీ షాట్ ఆడగా.. కెప్టెన్ విలియమ్సన్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో భారత్‌ 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (77 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (50 72 బంతుల్లో ఫోర్, సిక్స్) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ గెలుస్తుందని భావించారు. ఇద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐతే ఆఖర్లో జడేజా క్యాచ్ ఔట్.. ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు.. బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు 211/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) పరుగులు చేశారు.

Jul 10, 2019, 7:29 pm IST

పోరాడి ఓడిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ చివరి వరకు పోరాడినా.. కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టగా.. మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది.

Jul 10, 2019, 7:15 pm IST

జడేజా ఔట్.. స్కోర్ 208/7

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఔట్ అయ్యాడు. బోల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ధోనీ (33), భువీ (0)లు క్రీజులో ఉన్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 12బంతుల్లో 31 పరుగులు కావాలి.

Jul 10, 2019, 7:09 pm IST

జడేజా హాఫ్ సెంచరీ సెలెబ్రేషన్స్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేసాడు. సిక్సర్‌లు, ఫోర్లు బాదుతూ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం జడేజా తనదైన స్టయిల్లో సెలెబ్రేషన్స్ చేసాడు.

Jul 10, 2019, 7:06 pm IST

4 ఓవర్లు.. 42 పరుగులు

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలు టీమిండియాను ఆదుకున్నారు. జడేజా వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసాడు. మరోఆవైపు ధోనీ నెమ్మదిగా ఆడుతున్నాడు. ఈ జోడి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం ధోనీ (36), జడేజా (74) క్రీజులో ఉండి పోరాడుతున్నారు. భారత్ విజయానికి 4 ఓవర్లలో 42 పరుగులు కావాలి.

Jul 10, 2019, 7:02 pm IST

100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా,ధోనీ

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బ్యాట్ జుళిపిస్తున్నాడు. మరోఆవైపు ధోనీ నెమ్మదిగా ఆడినా జడేజాకు మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం ధోనీ (34), జడేజా (74) క్రీజులో ఉండి పోరాడుతున్నారు.

Jul 10, 2019, 6:58 pm IST

జడేజా సిక్స్.. రోహిత్ ఆనందం

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మరో సిక్స్ బాదాడు. దీంతో డగౌట్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ కేరింతలు కొడుతున్నాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న జడేజా వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ (33), జడేజా (66)లు క్రీజులో ఉండి పోరాడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 30 బంతుల్లో 52 పరుగులు కావాలి.

Jul 10, 2019, 6:49 pm IST

జడేజా హాఫ్ సెంచరీ.. అభిమానుల సందడి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేసాడు. సిక్సర్‌లు, ఫోర్లు బాదుతూ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కీలక సమయంలో జడేజా సెంచరీ చేయడంతో అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మైదానంలోని భారత అభిమానులు సందడి చేశారు.

Jul 10, 2019, 6:46 pm IST

జడేజా హాఫ్ సెంచరీ

న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేసాడు. సిక్సర్‌లు, ఫోర్లు బాదుతూ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

Jul 10, 2019, 6:45 pm IST

రవీంద్ర జడేజా @ 50

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేసాడు. సిక్సర్‌లు, ఫోర్లు బాదుతూ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కీలక సమయంలో జడేజా సెంచరీ చేయడంతో అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ధోనీ (28), జడేజా (53)లు క్రీజులో ఉండి పోరాడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 46 బంతుల్లో 71 పరుగులు కావాలి.

Jul 10, 2019, 6:40 pm IST

50 పరుగుల భాగస్వామ్యం

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బ్యాట్ జుళిపిస్తున్నాడు. సిక్సర్‌లు, ఫోర్లతో స్కోర్ వేగం పెంచుతున్నాడు. ధోనీ నెమ్మదిగా ఆడినా జడేజాకు మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి ఇప్పటికే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం ధోనీ (28), జడేజా (45) పోరాడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 51 బంతుల్లో 80 పరుగులు కావాలి.

Jul 10, 2019, 6:34 pm IST

బ్యాట్‌ ఝళిపిస్తున్న జడేజా

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత ఆటగాడు రవీంద్ర జడేజా బ్యాట్ జుళిపిస్తున్నాడు. హెన్రీ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. అనంతరం శాంట్నర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాడు. ఫెర్గుసన్ బౌలింగ్‌లో కూడా బౌండరీ బాది స్కోర్ పెంచుతున్నాడు. ప్రస్తుతం ధోనీ (24), జడేజా (39) పోరాడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 60 బంతుల్లో 90 పరుగులు కావాలి.

Jul 10, 2019, 6:27 pm IST

భారమంతా ధోనీ పైనే.. ఏం చేస్తాడో చూడాలి!!

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఎదురీదుతోంది. ఇప్పటికే భార‌త్ ఆరు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ప్రస్తుతం ధోనీ (22), జడేజా (19) పోరాడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 68 బంతుల్లో 100 పరుగులు కావాలి. ఇప్పుడు గెలుపు భారమంతా ధోనీ పైనే ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.

Jul 10, 2019, 6:21 pm IST

భార‌త్ విజ‌యానికి ఇంకా 78 బంతుల్లో 114 పరుగులు

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలో దిగిన టీమిండియా తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో తడబడుతోంది. ఇప్పటికే భార‌త్ ఆరు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ప్రస్తుతం ధోనీ (22), జడేజా (19) పోరాడుతున్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 78 బంతుల్లో 114 పరుగులు కావాలి.

Jul 10, 2019, 6:19 pm IST

పోరాడుతున్న ధోనీ, జడేజా

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలో దిగిన టీమిండియా ఫైన‌ల్ చేరే అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్ ఆరు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ప్రస్తుతం ధోనీ (22), జడేజా (19) పోరాడుతున్నారు.

Jul 10, 2019, 6:01 pm IST

జడేజా సిక్స్, 100 పరుగులు దాటిన టీమిండియా స్కోరు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో జడేజా సిక్స్ బాదడంతో టీమిండియా స్కోరు 100 పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బాదిన తొలి సిక్స్ ఇదే కావడం విశేషం.

Jul 10, 2019, 5:59 pm IST

తొలి సెమీస్‌లో మిచెల్ శాంట్నర్ గణాంకాలు ఇలా

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్ ఇప్పటికే తన ఆరు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. అతడి బౌలింగ్ గణాాంకాలు మీకోసం...

Jul 10, 2019, 5:49 pm IST

పాండ్యా ఔట్: ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 92 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా (32) పరుగుల వద్ద మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Jul 10, 2019, 5:19 pm IST

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(32) పరుగుల వద్ద కోలిన్ డి గ్రాండ్ హోమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ప్రస్తుతం 23 ఓవర్లకు గాను టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.

Jul 10, 2019, 5:12 pm IST

20 ఓవర్లకు టీమిండియా 70/4

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. దీంతో 20 ఓవర్లకు గాను 70 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(22), రిషబ్ పంత్(31) పరుగులతో ఉన్నారు.

Jul 10, 2019, 4:54 pm IST

50 పరుగుల స్కోరుని అందుకున్న టీమిండియా

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగులు స్కోరుని అందుకుంది. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(24), హార్ధిక్ పాండ్యా(12) పరుగులతో ఉన్నారు.

Jul 10, 2019, 4:35 pm IST

2011 నుంచి 2019 వరకు కోహ్లీని వెంటాడుతోన్న లెప్ట్ ఆర్మ్ పేసర్లు

2011 నుంచి 2019 వరకు ప్రపంచకప్‌లో జరిగిన సెమీపైనల్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీని లెప్ట్ ఆర్మ్ పేసర్లే ఔట్ చేయడం విశేషం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో సైతం కోహ్లీని పాక్ పేసర్ ఆమీర్ పెవిలియన్‌కు చేర్చాడు.

Jul 10, 2019, 4:32 pm IST

మాంచెస్టర్‌లో హైటెన్షన్ వాతావరణం

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పిచ్ కివీస్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుండగా... ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Jul 10, 2019, 4:19 pm IST

10 ఓవర్లకు టీమిండియా 24/4

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 10 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. బంతి విపరీతంగా స్వింగ్ అవుతుండడం కివీస్‌కు కలిసి వస్తోంది. దీంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగుతున్నారు. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్(6) జేమ్స్ నీషమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

Jul 10, 2019, 4:16 pm IST

మ్యాచ్‌కు ముందు వ్యూహారచనలో న్యూజిలాండ్ జట్టు

టీమిండియా బ్యాటింగ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలా గెలవాలనే దానిపై వ్యూహారచన చేసిన ఫోటోని ఐసీసీ అభిమానులతో పంచుకుంది.

Jul 10, 2019, 4:09 pm IST

జోష్‌లో న్యూజిలాండ్

లక్ష్య చేధనలో టీమిండియా కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ దేశ అభిమానులు మంచి జోష్‌లో ఉన్నారు.

Jul 10, 2019, 4:04 pm IST

కేఎల్ రాహుల్ ఔట్: మూడో వికట్ కోల్పోయిన టీమిండియా

240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే కివీస్ బౌలర్లు షాకిచ్చారు. బంతి విపరీతంగా స్వింగ్ అవుతుండడం కివీస్‌కు కలిసి వస్తోంది. నాలుగు పరుగుల వద్ద రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, ఆ వెంటనే లోకేశ్ రాహుల్ (1) హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది.

Jul 10, 2019, 4:00 pm IST

చేధనలో టీమిండియా రికార్డు ఇలా ఉంది

చేధనలో టీమిండియా రికార్డులు ప‌రిశీలిస్తే గ‌త మూడేళ్ల‌లో భార‌త్ 15 వ‌న్డేల్లో సుమారు 220 నుంచి 270 పరుగుల మ‌ధ్య టార్గెట్‌ను చేజింగ్ చేసింది. ఆ మ్యాచుల్లో భార‌త్ 14 వ‌న్డేల‌ను గెలుచుకున్న‌ది. ఓ మ్యాచ్ మాత్రం టై అయ్యింది. 220 నుంచి 270 ప‌రుగుల‌ టార్గెట్ ఉన్న మ్యాచ్‌ను గ‌త మూడేళ్ల‌లో ఇండియా కోల్పోలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో పిచ్ పేసర్లకు అనుకూలిస్తోంది. ఇప్పటికే 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచ‌రీల‌ు చేసి మంచి జోరు మీదన్న రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో ఒక ప‌రుగు మాత్ర‌మే చేసి నిష్క్ర‌మించాడు.

Jul 10, 2019, 3:56 pm IST

విరాట్ కోహ్లీ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన భారత్

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (1; 6 వికెట్లు) ఔటయ్యాడు. బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో ఎల్బీగా ఔటయ్యాడు. కోహ్లీ రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

Jul 10, 2019, 3:54 pm IST

గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ గణాంకాలు ఇలా

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో గణాంకాలు ఇలా ఉన్నాయి.

Jul 10, 2019, 3:41 pm IST

రోహిత్ శర్మ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

240 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియాకు ఆరంభంలోనే న్యూజిలాండ్ బౌలర్లు షాకిచ్చారు. జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(1) మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Jul 10, 2019, 3:38 pm IST

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం

240 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు క్రీజులోకి వచ్చారు.

Jul 10, 2019, 3:23 pm IST

టీమిండియా విజయ లక్ష్యం 240

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 240 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Jul 10, 2019, 3:16 pm IST

49వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన కివీస్

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 49వ ఓవర్‌లో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 49 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

Jul 10, 2019, 3:12 pm IST

రెండు బంతుల్లో రెండు వికెట్లు

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్ తొలి బంతికి టామ్ లాథమ్ (10) బౌండరీ లైన్ వద్ద రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 48.1 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.

Jul 10, 2019, 3:10 pm IST

ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 225 పరుగుల వద్ద రాస్ టేలర్(74) రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 48 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.

Jul 10, 2019, 3:04 pm IST

47 ఓవర్లకు న్యూజిలాండ్ 217/5

ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా బుధవారం భారత్-కివీస్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో 47 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(70),లాథమ్(6) పరుగులతో ఉన్నారు.

Jul 10, 2019, 2:57 pm IST

ఈ ప్రపంచకప్‌లో లూకీ ఫెర్గుసన్ గణాంకాలు

ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరుపున లూకీ ఫెర్గుసన్ అద్భుతమైన గణంకాలను నమోదు చేశాడు. తొలి సెమీస్‌లో సైతం న్యూజిలాండ్ జట్టు అతడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన లూకీ పెర్గుసన్ 18.58 యావరేజితో 17 వికెట్లు పడగొట్టాడు.

Jul 10, 2019, 2:54 pm IST

చాహల్‌కు షేన్‌వార్న్ స్పిన్ పాఠాలు

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ నుంచి టీమిండియా చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్పిన్ పాఠాలు నేర్చుకుంటున్న ఫోటో మీకోసం..

Jul 10, 2019, 2:48 pm IST

కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్

మరికొన్ని నిమిషాల్లో భారత్-కివీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మైదానంలో ఇరు జట్లు సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.

Jul 10, 2019, 2:45 pm IST

ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న ఇరు జట్లు

రిజర్వు డే రోజైన బుధవారం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఎక్కడ నుంచి ఆగిందో అక్కడ నుంచే మ్యాచ్‌ని కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మరో 23 బంతులు మిగిలి ఉన్నాయి.

{headtohead_cricket_3_4}

Story first published: Wednesday, July 10, 2019, 19:47 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X