న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో ప్రపంచకప్ ఫైనల్: ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 242

ICC World Cup 2019 Final:New Zealand Won The Toss And Elected To Bat First || Oneindia Telugu
ICC World Cup 2019: Final: England vs New Zealand: Live Score: England, Kiwis eye historic title

హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెన్రీ నికోల్స్ 77 బంతుల్లో 55(4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా... టామ్ లాథమ్ 56 బంతుల్లో 47(2 ఫోర్లు, ఒక సిక్స్) ఫరవాలేదనిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 242 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదుసార్లు న్యూజిలాండ్‌ గెలవగా, నాలుగు సార్లు ఇంగ్లాండ్ విజేతగా అవతరించింది. 1992 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ప్రపంచకప్ చరిత్రలో లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌ ఐదోసారి ఫైనల్స్‌కు ఆతిథ్యమివ్వబోతోంది.

లార్డ్స్‌ మైదానం 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు వేదికగా నిలిచింది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్‌ల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే.. గత నాలుగు ఫైనల్స్‌లో మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజతగా నిలిచింది. ఇక, ఈ ప్రపంచకప్‌ లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా... తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తారు.

Jul 14, 2019, 7:21 pm IST

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 242

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 242 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Jul 14, 2019, 7:10 pm IST

8వ వికెట్ కోల్పోయి న్యూజిలాండ్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8వ వికెట్ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 240 పరుగుల వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మ్యాట్ హెన్సీ(4) బౌల్డయ్యాడు. ప్రస్తుతం 49.3 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.

Jul 14, 2019, 7:05 pm IST

ఏడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 232 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో లాథమ్(47) హాఫ్ సెంచరీ ముంగిట జేమ్స్ విన్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 49 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.

Jul 14, 2019, 6:55 pm IST

ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 219 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్(16) పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 47 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

Jul 14, 2019, 6:53 pm IST

హ్యాట్సాఫ్‌ ప్లంకెట్‌

ఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్ ప్లంకెట్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేసిన ప్లంకెట్ 3 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.

Jul 14, 2019, 6:17 pm IST

ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 173 పరుగుల వద్ద ప్లంకెట్ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్(19) పరుగుల వద్ద జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 39 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

Jul 14, 2019, 5:51 pm IST

నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ వేసిన 34వ ఓవర్ తొలి బంతికి రాస్ టేలర్ (15) ఎల్బీగా ఔటయ్యాడు.

Jul 14, 2019, 5:35 pm IST

30 ఓవర్లకు న్యుజిలాండ్ 126/3

ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 30 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(5), రాస్ టేలర్(9) పరుగులతో ఉన్నారు.

Jul 14, 2019, 5:22 pm IST

మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్లంకెంట్ వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ హెన్రీ నికోల్స్ (55) బౌల్డయ్యాడు. ప్రస్తుతం 27 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

Jul 14, 2019, 5:06 pm IST

విలియమ్సన్ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన కివీస్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. ప్లంకెట్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్ నాలుగో బంతికి కేన్ విలియమ్సన్(30) జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

Jul 14, 2019, 4:30 pm IST

15 ఓవర్లకు న్యూజిలాండ్ 63/1

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో నికోల్స్‌ (27), విలియమ్సన్‌ (9) పరుగులతో ఉన్నారు.

Jul 14, 2019, 4:08 pm IST

ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తొలి వికెట్ భాగస్వామ్యాలివే

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తొలి వికెట్ భాగస్వామ్యాలివే

Jul 14, 2019, 4:05 pm IST

10 ఓవర్లకు న్యూజిలాండ్ 33/1

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో నికోల్స్‌ (10), విలియమ్సన్‌ (1) పరుగులతో ఉన్నారు.

Jul 14, 2019, 4:03 pm IST

ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఒక పరుగు చేయడంతో కేన్ విలియమ్సన్ ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే (548; 2007లో)ను అధిగమించాడు. జోప్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ నాలుగో బంతికి కేన్ విలియమ్సన్ ఒక పరుగు తీయడంతో ఈ ఘనత సాధించాడు.

Jul 14, 2019, 3:44 pm IST

తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి మార్టిన్ గుప్టిల్ (19) వికెట్లు ముందు దొరికి పోయాడు. 18 బంతులు ఎదుర్కొన్న గప్టిల్ 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేశాడు. గప్టిల్ రివ్యూకు వెళ్లినప్పటికీ వ్యతిరేక ఫలితమే వచ్చింది. బంతి మిడిల్ స్టంప్స్‌ను గిరాటేయనున్నట్టు తేలింది.

Jul 14, 2019, 3:38 pm IST

బతికిపోయిన నికోల్స్‌

కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ (2) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. 2.3వ బంతికి అతడిని అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. దీంతో నికోల్స్‌ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి వికెట్లను తగలడం లేదని తేలింది. దీంతో బతికిపోయాడు.

Jul 14, 2019, 3:34 pm IST

4 ఓవర్లకు న్యూజిలాండ్ 22/0

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.

Jul 14, 2019, 3:26 pm IST

2 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 8/0

2 ఓవర్లకు గాను న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు.

Jul 14, 2019, 3:22 pm IST

మొదటి ఓవర్ లో 5 పరుగులు రాబట్టిన కివీస్

మొదటి ఓవర్ ముగిసింది. క్రిస్ వోక్స్ ఐదు పరుగులు సమర్పించుకున్నాడు. ఓపెనర్ మాార్టిన్ గుప్టిల్ ఒక ఫోర్ బాదాడు.

Jul 14, 2019, 3:08 pm IST

ఇంగ్లాండ్‌ జట్టు:

జేసన్‌రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జోరూట్‌, ఇయాన్‌మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, జోఫ్రాఆర్చర్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్‌

Jul 14, 2019, 3:06 pm IST

న్యూజిలాండ్‌ జట్టు:

మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌టేలర్‌, జేమ్స్‌ నీషమ్‌, టామ్‌లాథమ్‌, కొలిన్‌డి గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, మాట్‌హెన్రీ, ట్రెంట్‌బౌల్ట్‌, లాకీ ఫెర్గూసన్‌

Jul 14, 2019, 2:52 pm IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన కివీస్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఈ సారైనా విశ్వవిజేతగా నిలవాలని విలియమ్సన్‌ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌ 1992 తర్వాత ఫైనల్స్‌ చేరడం ఇదే తొలిసారి. ఫైనల్లో మాత్రం టాస్‌ ఎంతో కీలకం. గత ప్రపంచకప్‌ల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే.. గత నాలుగు ఫైనల్స్‌లో మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజతగా నిలిచింది.

Jul 14, 2019, 2:40 pm IST

ప్రపంచకప్ ఫైనల్‌కు పిచ్ సిద్ధం

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోన్న ప్రపంచకప్ ఫైనల్ పిచ్ ఇదే

Jul 14, 2019, 2:30 pm IST

రాత్రి వర్షం కురిసిన కారణంగా టాస్ ఆలస్యం

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఆలస్యమైంది. శనివారం రాత్రి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో వర్షం కురిసిన కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగానే ఉంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

1
43691

{headtohead_cricket_2_4}

Story first published: Sunday, July 14, 2019, 19:25 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X