న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కార్డిఫ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద: బంగ్లాకు భారీ లక్ష్యం

ICC World Cup 2019, England posted an imposing 386/6 in windy Cardiff

హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మైదానంలో పరుగుల వరద పారించారు. జేసన్ రాయ్(153: 121 బంతుల్లో 14ఫోర్లు, 5సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో(51: 50 బంతుల్లో 6ఫోర్లు), జోస్ బట్లర్(64: 44 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 386 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్, హసన్ చెరి రెండు, మోర్తజా, రహ్మన్ తలో వికెట్ తీశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో జట్టుకు చక్కటి ఆరంభానిచ్చారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. రాయ్, బెయిర్‌స్టోలు తొలి వికెట్‌కి 128 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ అనంతరం మోర్తజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో(51) ఔట్ అయ్యాడు.

20వ ఓవర్ తొలి బంతిని

20వ ఓవర్ తొలి బంతిని

20వ ఓవర్ తొలి బంతిని బెయిర్‌స్టో షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వెళ్లిన బంతిని మెహిదీ హసన్ అద్బుత క్యాచ్‌కు బెయిర్‌స్టో వెనుదిరిగాడు. ఒక వికెట్ దక్కడంతో బంగ్లాకు మాత్రం ఊరట లభించింది. ఈ క్రమంలో జోరూట్‌(21)తో కలిసి రాయ్‌ విధ్వంసకరంగా ఆడాడు. అయితే, ఆ తర్వాత ఏ దశలోనూ స్కోరు వేగం తగ్గలేదు. ముస్తాఫిజుర్ వేసిన 27వ ఓవర్‌లో ఫోర్ బాదిన రాయ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

92 బంతుల్లోనే 100 పరుగులు

92 బంతుల్లోనే 100 పరుగులు

కేవలం 92 బంతుల్లోనే 100 పరుగులు మార్క్ అందుకున్నాడు. జేసన్ రాయ్‌కి ఇది తొలి వరల్డ్ కప్ సెంచరీ కాగా.. వన్డేల్లో మొత్తంగా తొమ్మిదివది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య జట్టును బంగ్లాదేశ్ బౌలర్లు ఏదశలోనూ కట్టడి చేయలేకపోయారు. జట్టు స్కోరు 205 వద్ద జో రూట్‌.. సైఫుద్దీన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో బట్లర్‌ క్రీజులోకి వచ్చాడు.

35వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు

35వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు

బట్లర్, రాయ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. తొలుత ఆచితూచి ఆడిన బట్లర్‌ నిలకడగా బాదుడు మొదలు పెట్టాడు. ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన జేసన్ రాయ్‌ 150 పరుగుల మార్కుని అందుకున్నాడు. ఆరు సిక్సర్లు బాదాలనే ఉద్దేశంతో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు అత్యధిక స్కోరు

ఆ తర్వాత జోస్ బట్లర్‌ అద్భుతమైన సిక్సర్లతో అలరించాడు. బట్లర్ దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. అయితే జట్టు స్కోరు 330 వద్ద జోస్ బట్లర్‌, 340 పరుగుల వద్ద (35: 33 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) వేగంగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకున్నాడు. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(6) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో టెయిలెండర్లు ప్లంకెట్(27 నాటౌట్), క్రిస్ వోక్స్(18) దూకుడుగా ఆడి ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు అందించారు.

1
43655

{headtohead_cricket_2_10}

Story first published: Saturday, June 8, 2019, 20:31 [IST]
Other articles published on Jun 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X