For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బోణీ.. చరిత్రకెక్కిన సఫారీలు!!

ICC Women’s T20 World Cup 2020: South Africa register maiden T20 World Cup win against England

పెర్త్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. ఆదివారం గ్రూప్‌ 'బి'లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. తొలిసారి ఇంగ్లండ్‌ లాంటి మేటి జట్టుపై గెలుపొంది చరిత్రకెక్కారు సఫారీ మహిళలు. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్‌పై సఫారీలు విజయం సాధించారు. సఫారీ స్టార్ బ్యాట్స్‌వుమన్‌ ఇక డు ప్రీజ్‌100వ టీ20 మ్యాచ్ ఆడింది.

మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించింది. ఓపెనర్‌ జోన్స్‌ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. విల్సన్‌ (14) పర్లేదనిపించారు. సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్‌ నికెర్క్‌ (2/20), మరిజనె (2/19) వికెట్లు పడగొట్టారు.

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని అందకుంది. ఓపెనర్, కెప్టెన్‌ వాన్‌ నికెర్క్‌ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్‌ బౌలర్‌ ఎకిల్‌స్టోన్‌ 2 వికెట్లు తీసింది. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో.. తొలి రెండు బంతులకు 2 రన్సే రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. కానీ డు ప్రీజ్‌ (18 నాటౌట్‌) ఒత్తిడిని అధిగమించి 3, 4 బంతులను సిక్స్‌, ఫోర్‌ బాది దక్షిణాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించింది.

టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌.. నేడు వాకా మైదానంలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూప్‌-ఏలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్‌ దశకు దగ్గరైనట్టే. సోమవారం జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-శ్రీలంక తగ్గాలపడనున్నాయి. రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.

Story first published: Monday, February 24, 2020, 12:04 [IST]
Other articles published on Feb 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+