న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2017 సంవత్సరానికి ఐసీసీ వన్డే, టీ20 జట్లివే: భారత్ నుంచి ముగ్గురు

By Nageshwara Rao
ICC unveils Women's ODI, T20I teams of 2017; Ekta Bisht only player to feature in both the sides

హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే, టీ20 జట్టుని గురువారం (డిసెంబర్ 21)న ప్రకటించింది. భారత్ నుంచి ఏక్తా బిస్త్ రెండు జట్లలో (వన్డే, టీ20) చోటు దక్కించుకున్న క్రికెటర్‌గా నిలిచింది.

వన్డే జట్టులో ఏక్తా బిస్త్‌తో పాటు భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కి చోటు దక్కగా... ఇక, టీ20 జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ చోటు దక్కించుకుంది. వన్డే జట్టుకు ఇంగ్లాండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హీథర్ నైట్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, టీ20 జట్టుకు వెస్టిండిస్ క్రికెటర్ స్టఫానీ టేలర్ కెప్టెన్‌గా ఎంపికైంది.

ఈ ఏడాది జులై 23న లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ ఫైనల్లో హీథర్ నైట్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ పైనల్లో జట్టులోని సహచర క్రీడాకారిణుల ఆదర్శంగా నిలిచినందుకు గాను ఆమెను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ పేర్కొంది.

ఇక, స్టఫానీ టేలర్ విషయానికి ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్ధానంలో ఉంది. ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేసింది. వన్డే జట్టులో ఐదు దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి నలుగురు, ఇండియా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ఒకరు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఎంపికయ్యారు.

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టాప్-4లో కొనసాగుతున్న క్రికెటర్లు వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక టీ20 జట్టు విషయానికి వస్తే ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, ఇంగ్లాండ్ నుంచి ఒకరు, ఇండియా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, వెస్టిండిస్ నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు.

భారత్‌కు చెందిన ఏక్తా బిస్త్ ఐసీసీ ప్రకటించిన రెండు జట్లలో చోటు దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల ఏక్తా బిస్త్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో 14వ స్ధానం, టీ20ల్లో 12వ స్ధానంలో కొనసాగుతోంది. వన్డేల్లో 34 వికెట్లు, టీ20ల్లో 11 వికెట్లు తీసుకుంది.


ఐసీసీ ఉమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ (బ్యాటింగ్ ఆర్డర్‌లో):
1. టామీ బీయుమొంట్ (ఇంగ్లాండ్)
2. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)
3. మిథాలీ రాజ్ (ఇండియా)
4. అమీ సాటర్త్వవైతే (న్యూజిలాండ్)
5. ఎల్లైస్ పెర్రీ (ఆస్ట్రేలియా)
6. హీథర్ నైట్ (కెప్టెన్) (ఇంగ్లాండ్)
7. సారా టేలర్ (వికెట్ కీపర్) (ఇంగ్లాండ్)
8. డాన్ వాన్ నీకెర్క్ (దక్షిణాఫ్రికా)
9. మారిజాన్నే కాప్ (దక్షిణాఫ్రికా)
10. ఏక్త బిస్త్ (ఇండియా)
11. అలెక్స్ హార్ట్లీ (ఇంగ్లాండ్)


ఐసీసీ మహిళల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్ (బ్యాటింగ్ ఆర్డర్‌లో):
1.బెత్ మూనీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా)
2.డనీ వ్యాట్ (ఇంగ్లాండ్)
3. హర్మన్ ప్రీత్ కౌర్ (ఇండియా)
4 స్టఫానీ టేలర్ (కెప్టెన్) (విండీస్)
5. సోఫీ డేవిన్ (న్యూజిలాండ్)
6. డ్యాండ్రా డాటీన్ (విండీస్)
7. హేలే మాథ్యూస్ (విండీస్)
8. మేగాన్ షట్ (ఆస్ట్రేలియా)
9. అమండా-జాడే వెల్లింగ్టన్ (ఆస్ట్రేలియా)
10. లీ తహుహు (న్యూజిలాండ్)
11. ఏక్త బిస్త్ (ఇండియా)

Story first published: Thursday, December 21, 2017, 15:14 [IST]
Other articles published on Dec 21, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X