న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జపాన్ 41కే ఆలౌట్: వికెట్ పడకుండా 4.5 ఓవర్లలో భారత ఓపెనర్లు బాదేశారు

ICC U19 World Cup: Ravi Bishnoi shines as India bowl out Japan for 41; India colts win by 10 wickets

హైదరాబాద్: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. తాజా విజయంతో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. టోర్నీలో భాగంగా మంగళవారం గ్రూప్‌-ఎలో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఓవర్ల పరంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండో వేగవంతమైన విజయం కావడం విశేషం. జపాన్ నిర్దేశించిన 42 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత యువ జట్టు వికెట్ నష్టపోకుండా 4.5 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(29), కుమార్ కుశాగ్ర(13) పరుగులతే అజేయంగా నిలిచారు.

దీంతో 271 బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించినట్లైంది. ఈ టోర్నీలో ఇది రెండో విజయం. అంతకముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జపాన్ 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్‌ (5/4), కార్తీక్ త్యాగి (10/3) విజృంభించడంతో జపాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోని ఐదుగురు బ్యాట్స్‌మన్‌లు వరుసగా డకౌటయ్యారు.

విజృంభించన భారత బౌలర్లు

విజృంభించన భారత బౌలర్లు

ఓపెనర్, కెప్టెన్ మార్కస్ తుర్గేట్ (1), నీల్ డేట్‌ (0)ను త్యాగి పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ షు నోగుచి (7)ని బిష్ణోయ్‌ ఔట్ చేసాడు. ఆ తర్వాత జపాన్ బ్యాట్స్‌మన్‌ భారత బౌలర్ల దాడి ముందు నిలవలేకపోయారు. ఒక్కొకరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో జపాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోని ఐదుగురు బ్యాట్స్‌మన్‌లు వరుసగా డకౌట్ అయ్యారు.

8 ఓవర్లు.. 5 పరుగులు.. 4 వికెట్లు

జపాన్ ఆటగాళ్లు షు నోగుచి (7), కెంటో ఓటా డోబెల్ (7) చేసిన పరుగులే అత్యధికం. మాక్స్ క్లెమెంట్స్ 5 పరుగులు చేసాడు. నీల్ డేట్‌, దేబాషిష్ సాహూ, కజుమాసా తకాహషి, ఇషాన్ ఫర్తాల్, యాష్లే తుర్గేట్‌లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్ బిష్ణోయ్‌ 8 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. మరో బౌలర్ త్యాగి 6 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. జపాన్ 41 పరుగులకే ఆలౌట్ అయి టీమిండియా ముందు 42 పరుగుల స్వల్ప లక్ష్యంను ఉంచింది.

రెండో అత్యల్ప స్కోరు

రెండో అత్యల్ప స్కోరు

అండర్‌-19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో జపాన్ రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2004లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 ఆలౌట్ అయింది. కెనడా మరియు బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ యొక్క 2002 మరియు 2008 ఎడిషన్లలో వరుసగా 41 పరుగులు చేసాయి. అనంతరం జపాన్ కూడా 41 పరుగులకు ఆలౌట్ అయింది.

శ్రీలంకపై ఘన విజయం

శ్రీలంకపై ఘన విజయం

భారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (74 బంతుల్లో 8 ఫోర్లతో 59), కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ (72 బంతుల్లో 2 ఫోర్లతో 56) భారీ స్కోర్ అందించగా.. ఆకాశ్‌ సింగ్‌, సిద్ధేశ్‌ వీర్‌ లంక పతనాన్ని శాసించారు.

Story first published: Tuesday, January 21, 2020, 18:04 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X