న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC U19 World Cup 2020: టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే!

ICC U19 World Cup 2020: Complete schedule of India matches

హైదరాబాద్: జనవరి 17న దక్షిణాఫ్రికా వేదికగా ఆరంభమయ్యే అండర్-19 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న భారత యువ జట్టు 5వసారి ట్రోఫీపై కన్నేసింది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుని భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసినవాడే. అండర్-19 వరల్డ్‌కప్ నుంచి వచ్చి ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇతర ఆటగాళ్లు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మరియు పృథ్వీ షా. ఈసారి భారత జట్టుకు ప్రియం గార్గ్‌ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

<strong>టీ20 పవర్ ప్లేలో అత్యధిక స్కోరు: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్</strong>టీ20 పవర్ ప్లేలో అత్యధిక స్కోరు: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

యశస్వీ జైస్వాల్‌పై భారీ అంచనాలు

యశస్వీ జైస్వాల్‌పై భారీ అంచనాలు

ఇటీవలే గార్గ్‌ను ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. పిన్న వయస్సులోనే లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వీ జైస్వాల్‌పై ఈ టోర్నీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ కావడం విశేషం.

సూపర్ లీగ్ మాదిరి రెండో అర్ధభాగం

సూపర్ లీగ్ మాదిరి రెండో అర్ధభాగం

ఈ సీజన్ రెండో అర్ధభాగం సూపర్ లీగ్ మాదిరి జరగనుంది. న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో పాటు భారత క్రికెట్ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో మొదటిసారి జపాన్ తలపడుతోంది. భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుండగా... ఆ తర్వాత జనవరి 21న జపాన్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

మొత్తం నాలుగు గ్రూపులు

మొత్తం నాలుగు గ్రూపులు

గ్రూప్ ఎ: ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్

గ్రూప్ బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, నైజీరియా

గ్రూప్ సి: పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, స్కాట్లాండ్

గ్రూప్ డి: ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, యుఎఇ, కెనడా.

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

తేదీ: జనవరి 19 (మధ్యాహ్నం 1.30 IST)

మ్యాచ్: ఇండియా Vs శ్రీలంక, 7వ మ్యాచ్, గ్రూప్ ఎ

వేదిక: మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్

తేదీ: జనవరి 21 (మధ్యాహ్నం 1.30 IST)

మ్యాచ్: ఇండియా Vs జపాన్, 11వ మ్యాచ్, గ్రూప్ ఎ

వేదిక: మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్

తేదీ: జనవరి 24 (మధ్యాహ్నం 1.30 IST)

మ్యాచ్: ఇండియా Vs న్యూజిలాండ్, 20 వ మ్యాచ్, గ్రూప్ ఎ

వేదిక: మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్

తేదీ: ఫిబ్రవరి 03, 2020

మ్యాచ్: ఫైనల్

వేదిక: సేన్వెస్ పార్క్, పోట్చెఫ్‌స్ట్రూమ్

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు:

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు:

ప్రియామ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యన్ష్ సక్సేనా, ధ్రువ్ చంద్ జురెల్ (వైస్ కెప్టెన్), శశ్వత్ రావత్, సిద్ధేష్ వీర్, శుభంగ్ హెగ్డే, రవి బిష్ణోయ్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, అధర్వ సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్

Story first published: Thursday, January 16, 2020, 13:59 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X