యువ క్రికెటర్‌కు పాతిక లక్షల నజారానా అందించనున్న రాజస్థాన్

Posted By: Subhan
ICC U-19 World Cup 2018: Shubman Gill has always been a dedicated cricketer, says father

హైదరాబాద్: కుర్రోళ్లకు అండర్ 19 ప్రపంచ కప్ మంచి పేరు తెచ్చి పెట్టింది. అండర్ 19 వరల్డ్ కప్‌ గెలుచుకున్న భారత జట్టు ఐపీఎల్‌లో సెలక్ట్ అయ్యేందుకు మంచి వేదికైంది. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రపంచ కప్ చక్కని వేదిక అయింది. రాజస్థాన్ నుంచి అండర్ 19 జట్టుకు ఎంపికైన శుభ్‌మన్ గిల్ భారత జట్టులో ఆడాడు. సెమీ ఫైనల్‌లో ఎవ్వరూ ఊహించని రీతిలో సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన నాగర్‌కోటికి రాజస్థాన్‌ ప్రభుత్వం తాజాగా రూ.25లక్షల నజరానా ప్రకటించింది. ఈ బహుమతి ఇవ్వనున్నామని నామమాత్రంగా ముందుగానే ప్రకటించినా.. మళ్లీ దానిని నిర్ధారించింది. సోమవారం రాజస్థాన్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే బడ్జెట్‌ ప్రసంగంలో నాగర్‌కోటికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రూ.25లక్షల నజరానా అందజేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన అండర్‌-19ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌.. ఆసీస్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

టోర్నీలో భారత్‌ విజయాల్లో నాగర్‌కోటి కీలక పాత్ర పోషించాడు. 140కి.మీ స్పీడుకు ఏమాత్రం తగ్గకుండా కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఈ యువ ఆటగాడు ఐపీఎల్‌లోనూ ఎక్కువ ధరే పలికాడు. రూ.3.2కోట్లు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నాగర్‌కోటిని సొంతం చేసుకుంది.
ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోని ఒక్కో ఆటగాడికి బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అండర్‌-19 జట్టు సారథి పృథీ షాకు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ రూ.25లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.శుభ్‌మాన్ గిల్‌కు క్రికెట్ తప్ప వేరే ప్రపంచం లేదని అతని తండ్రి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 11:33 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి