న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC schedule For Men 2024-2031: ఎనిమిదేళ్ల క్రికెట్ క్యాలెండర్ ఇదే.. కన్నుల పండుగే!

ICC: Mens T20 World Cup will be having 55 and ODI World Cup will be having 54 matches

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌.. వచ్చే ఎనిమిది సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ క్యాలెండర్‌ను ప్రకటించింది. దీనితోపాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ప్రపంచకప్ టోర్నమెంట్లలో భారీ మార్పులూ చేసింది. అందులో పాల్గొనే జట్ల సంఖ్యను రెట్టింపు చేసింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇకపై 54 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. అదే- టీ20 ప్రపంచకప్‌లో 55 మ్యాచ్‌లు ఉంటాయి. క్రికెట్ ఆడే వర్దమాన దేశాలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా- కొత్త జట్లకు అవకాశం ఇచ్చింది. అలాగే ఛాంపియన్ ట్రోఫీలో ఎనిమిది జట్లు ఆడే వీలు కల్పించింది.

ఎనిమిదేళ్ల క్యాలెండర్ డీటెయిల్స్..

ఎనిమిదేళ్ల క్యాలెండర్ డీటెయిల్స్..

ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇకపై 20 జట్లు పాల్గొంటాయి. 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో ఈ సంఖ్య 14కు పరిమితం చేసింది. ఎప్పట్లాగే ఈ రెండు టోర్నమెంట్లను రెండు, నాలుగేళ్లకోసారి నిర్వహించాల్సి ఉంటుందని నిర్ధారించింది ఐసీసీ. ఈ క్రికెట్ క్యాలెండర్ ప్రకారం.. 2024-టీ20 ప్రపంచకప్, 2025-ఛాంపియన్ ట్రోఫీ, 2025-ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2026-టీ20 ప్రపంచకప్, 2027-వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్, 2027-ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2028-టీ20 ప్రపంచకప్, 2029-ఛాంపియన్ ట్రోఫీ, 2030-టీ20 ప్రపంచకప్, 2031-వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్, అదే ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహణ ఉంటుంది.

2027 దాకా వెయిటింగ్..

2027 దాకా వెయిటింగ్..

2024లో జరిగే వన్డే ఇంటర్నేషనల్స్ వరల్డ్‌ కప్‌‌లో ఎలాంటి మార్పులు కూడా ఉండబోవు. ఎప్పట్లాగే 10 జట్లు ఆడతాయి. ఆ తరువాత ఏర్పాటయ్య 2027 వరల్డ్‌కప్ నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. 2027, 2031లో నిర్వహించే ప్రపంచకప్​ టోర్నమెంట్లలో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 54గా ఉంటుంది. ఇక- 2024, 2026, 2028, 2030లో టీ20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది ఐసీసీ. వాటిల్లో 20 జట్లు పాల్గొంటాయి. మొత్తం మ్యాచ్​ల సంఖ్య 55కు పెంచుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ కూడా..

ఛాంపియన్స్ ట్రోఫీ కూడా..

షెడ్యూల్ ప్రకారం.. 2020లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌లో దాన్ని నిర్వహించడానికి ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ఒక ఏడాది ఆలస్యం అయినప్పటికీ.. 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీ యధాతథంగా కొనసాగుతుందని ఐసీసీ తెలిపింది. దానికి అనుగుణంగానే ఈ ఎనిమిదేళ్లలో నిర్వహించబోయే టీ20 టోర్నీలను ఫిక్స్ చేసింది. చాంపియన్స్​ ట్రోఫీని కూడా తన క్యాలెండర్‌లో చేర్చింది ఐసీసీ. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఈవెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. 2025, 2029లో ఇది ప్రేక్షకుల ముందుకొస్తుంది.

సుదీర్ఘకాలం పాటు డబ్ల్యూటీసీ ఫైనల్

సుదీర్ఘకాలం పాటు డబ్ల్యూటీసీ ఫైనల్

ఈ నెల 18వ తేదీన ఆరంభం కాబోయే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తామనే సంకేతాన్ని ఇచ్చింది ఐసీసీ. ప్రతి రెండేళ్లకోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంటుంది. 2025, 2027, 2029, 2031లో దీన్ని ఏర్పాటు చేస్తుంది. టీ20 ఫార్మట్‌ వెలుగులోకి వచ్చిన తరువాత అయిదు రోజుల పాటు సుదీర్ఘంగా సాగే టెస్ట్ మ్యాచ్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందనే కారణంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. 2019లో తొలిసారిగా ఈ టోర్నీ ఆరంభమైంది. ఈ నెల 18న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.

Story first published: Wednesday, June 2, 2021, 11:50 [IST]
Other articles published on Jun 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X