న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకులు: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకులకు ధావన్, కుల్దీప్

Shikhar Dhawan, Kuldeep Take Giant Leaps in ICC T20I Rankings | Oneindia Telugu
ICC Rankings: Kuldeep, Adam Zampa make big leap in T20I chart

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ముగిసింది. తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించగా, వర్షం కారణంగా రెండో టీ20 రద్దైంది. ఇక, సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో కోహ్లీసేన విజయం సాధించడంతో ఈ సిరిస్ 1-1 సమం అయింది.

<strong>భారత్ vs ఆసీస్: సిడ్నీ టీ20లో కోహ్లీసేన విజయంతో ఆ రికార్డు పదిలం</strong>భారత్ vs ఆసీస్: సిడ్నీ టీ20లో కోహ్లీసేన విజయంతో ఆ రికార్డు పదిలం

ఈ సిరిస్ అనంతంర ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కుల్దీప్ యాదవ్, ఆసీస్ నుంచి ఆడమ్ జంపా తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.

కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి కుల్దీప్

కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి కుల్దీప్

చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదో ర్యాంక్‌ని చేజిక్కించుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి చేరుకున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో బ్రిస్బేన్ వేదికగా గత బుధవారం ముగిసిన తొలి టీ20లో 42 బంతుల్లో 76 పరుగులు చేసిన శిఖర్ ధావన్.. ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లోనూ 22 బంతుల్లో 41 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

11వ స్థానంలో నిలిచిన ఓపెనర్ శిఖర్ ధావన్

11వ స్థానంలో నిలిచిన ఓపెనర్ శిఖర్ ధావన్

ఇక, ఈ సిరిస్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరిస్ అవార్డు అందుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో 11వ నిలిచాడు. టీ20 కెరీర్‌లో ధావన్‌కు అత్యుత్తమ ర్యాంకుకి చేరుకోవడం ఇదే తొలిసారి. బౌలర్ల ర్యాంకుల్లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 20 స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా, 17 స్థానాలు ఎగబాకిన ఆడమ్ జంపా ఐదో స్థానంలో నిలిచాడు.

 కోహ్లీ ర్యాంకింగ్‌లో మార్పు లేదు

కోహ్లీ ర్యాంకింగ్‌లో మార్పు లేదు

ఆస్ట్రేలియా గడ్డపై బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ తొలి టీ20లో 2/24, రెండో టీ20లో 1/23, మూడో టీ20‌లో 1/19తో మెరిశాడు. మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసి భారత్ జట్టుని గెలిపించినా కెప్టెన్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కోహ్లీ 14వ స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.

 ఆల్‌రౌండర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్‌దే అగ్రస్థానం

ఆల్‌రౌండర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్‌దే అగ్రస్థానం

ఇక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ని సమం చేసిన భారత్ జట్టు 127 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. పాక్ 138 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, అల్‌రౌండర్ల జాబితాలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Monday, November 26, 2018, 15:14 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X