న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Player Of the Month : శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌కే జులై మంత్ అవార్డ్.. మహిళల్లో మన రేణుకమ్మకు రాలే

ICC Player Of The Month July: Prabath Jayasuriya Won the Award, Renukha Singh Missed Award

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022లో జులై నెలకు సంబంధించిన 'ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్' విజేతలను ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మెన్స్, వుమెన్స్ క్రికెటర్లకు ఈ అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో.. ఐసీసీ అవార్డు నామినీల జాబితాను ప్రకటించింది.

మెన్స్ విభాగంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో, శ్రీలంక స్పిన్‌ సంచలనం ప్రభాత్‌ జయసూర్య, ఫ్రాన్స్‌ యువ స్టార్‌ గుస్తావ్‌ మెక్‌కియోన్‌ల మధ్య పోటీ జరిగింది. అదేవిధంగా మహిళా విభాగంలో ఇంగ్లాండ్ నయా ఓపెనర్ ఎమ్మా లాంబ్, ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కివర్, భారత పేస్ సంచలనం రేణుకా సింగ్ నామినీలుగా ఎంపికయ్యారు.

అరంగేట్రంలోనే అదుర్స్

అరంగేట్రంలోనే అదుర్స్

మెన్స్ క్రికెట్లో ప్రభాత్ జయసూర్యను జులై నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి నెలలో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అతను గెలుచుకోవడం గమనార్హం. అతను శ్రీలంక తరఫున ప్రస్తుతం స్పిన్ హీరోగా చెలామణీ అవుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత గుర్తుండిపోయే అరంగేట్ర ప్రదర్శనను ప్రభాత్ జయసూర్య సొంతం చేసుకున్నాడు.

అతను గాలేలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక సమం చేయడంలో కీలక ప్రదర్శన కనబరిచాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 6/118, 6/59 ప్రదర్శనతో చెలరేగాడు. జయసూర్య సంచలనాత్మక బౌలింగ్‌తో ఆస్ట్రేలియాపై శ్రీలంక ఇన్నింగ్స్ ప్లస్ 39పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఓటు వేసినందుకు ధన్యవాదాలు

ఓటు వేసినందుకు ధన్యవాదాలు

ఇక అవార్డు సందర్భంగా ప్రభాత్ స్పందించాడు. ‘నేను ఈ అవార్డు రావడం పట్ల సంతోషిస్తున్నాను. నాకు ఓటు వేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా జీవితంలోనే అద్భుతమైన నెల. నేను టెస్ట్ అరంగేట్రం చేశాను. ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో ఆడిన టెస్ట్ సిరీస్‌లను సమం చేయడానికి నా జట్టుకు సహకరించే బౌలింగ్ చేశాను. నా ప్రయాణంలో నాకు తోడ్పాటు అందించిన అభిమానులు, సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు రావడం పట్ల నేను చాలా థ్రిల్ అవుతున్నాను' అని అతను చెప్పాడు.

మూడో ఓపెనర్ ఛాయిస్,నాలుగో పేస్ ఆప్షన్ ఎక్కడ? *Cricket | Telugu OneIndia
మన రేణుకకు మిస్సయింది..

మన రేణుకకు మిస్సయింది..

మహిళల క్రికెట్ విషయానికి వస్తే.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లాంబ్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆమె సత్తా చాటింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో తన తొలి వన్డే సెంచరీని చేసింది. అలాగే వరుసగా రెండు మ్యాచుల్లో 67, 65పరుగులతో రెండు హాఫ్ సెంచరీలు సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకంగా వ్యవహరించింది. ఇకపోతే భారత వుమెన్స్ క్రికెటర్.. మహిళ భువీ అయిన రేణుక సింగ్‌కు నిరాశే ఎదురైంది. భారత పేస్ దళంలో నిఖర్సైన స్వింగ్ పేసర్‌గా రేణుకా సింగ్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, August 9, 2022, 18:05 [IST]
Other articles published on Aug 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X