కోహ్లీ, బాబర్ ఆజమ్ మధ్య ఎంత తేడా: ఐసీసీ ర్యాంకుల్లో టాపర్‌గా పాక్ సారథి: టాప్ 10లో లేని విరాట్

TOP 10 లో లేని Team India, KL Rahul తప్ప.. Virat, Rohit ఏంటిది ?? || Oneindia Telugu

ముంబై: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ఫార్మట్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటించింది. భారత్ క్రికెట్ అభిమానులకు ఏ మాత్రం ఉత్సాహాన్ని కలిగించని అంశం ఇది. టీమిండియాకు చెందిన ఒకే ఒక్కడు తప్ప.. మరెవరూ టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో నిల్చోలేకపోయారు. తమ స్థానాన్ని దిగజార్చుకున్నారు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లు ఇద్దరేసి చొప్పున తొలి 10 స్థానాల్లో నిలిచారు.

టెస్ట్ మ్యాచ్‌లకు..టీ20లకూ తేడా ఉండదా ఇక: ఆ స్పెషలిస్ట్ బ్యాటర్ అరంగేట్రం ఖాయంటెస్ట్ మ్యాచ్‌లకు..టీ20లకూ తేడా ఉండదా ఇక: ఆ స్పెషలిస్ట్ బ్యాటర్ అరంగేట్రం ఖాయం

 టాపర్‌గా బాబర్

టాపర్‌గా బాబర్

పాకిస్తాన్ కేప్టెన్ ప్లస్ డాషింగ్ ఓపెనర్ బాబర్ ఆజమ్.. ఐసీపీ టీ20 ఫార్మట్ ర్యాంకింగుల్లో కింగ్‌గా నిలిచాడు. అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అతని లభించిన పాయింట్లు 809. బాబర్ ఆజమ్‌తో పాటు ఓపెనర్‌గా క్రీజ్‌లోకి దిగే మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. 735 పాయింట్లను అతను సాధించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌తో పాటు బంగ్లాదేశ్‌తో సాగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ వారిద్దరూ సత్తా చాటిన విషయం తెలిసిందే.

రెండో స్థానంలో మలాన్..

రెండో స్థానంలో మలాన్..

ఈ టాప్ 10 టేబుల్‌లో 805 పాయింట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ రెండో స్థానంలో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్‌లో రాణించిన బ్యాటర్లలో మలాన్ ఒకడు. దక్షిణాఫ్రికన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మూడో స్థానంలో ఉన్నాడు. అతని పాయింట్లు 796. టీమిండియా డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. అయిదో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక్కడే. 729 పాయింట్లతో అతను తొలి అయిదు మందిలోనూ నిలవగలిగాడు.

 ఆరో స్థానంలో ఆరోన్..

ఆరో స్థానంలో ఆరోన్..

ఆస్ట్రేలియా టీ20 ఫార్మట్ కేప్టెన్ ప్లస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కోన్వే-703, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్, దక్షిణాఫ్రికాకే చెందిన రస్సీ వ్యాన్‌డెర్ డుస్సెన్-669, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టన్ గుప్టిల్-658 పాయింట్లతో టాప్ టెన్‌లో చివరి అయిదు స్థానంలో నిలిచారు. ఇదివరకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉండేవాడు విరాట్ కోహ్లీ. పేలవమైన ఆటతీరును తన స్థానాన్ని దిగజార్చుకున్నాడు. 11వ స్థానంలో నిలిచాడు.

13వ స్థానంలో రోహిత్..

రోహిత్ శర్మ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌పై ఇటీవలే ముగిసిన మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో అద్భుతంగా ఆడాడీ హిట్‌మ్యాన్. వరుసగా 48, 55, 56 పరుగులు చేశాడు. అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. మొత్తంగా 159 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీనితో అతని ర్యాంకింగ్ మెరుగుపడింది. 13వ స్థానానికి ఎగబాకాడు. సూర్యకుమార్ యాదవ్ 24, ఫకర్ జమాన్ తమ స్థానాలను కొంతమేర మెరుగుపర్చుకోగలిగారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 24, 2021, 18:08 [IST]
Other articles published on Nov 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X