న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ విచారణకు హాజరైన ఖుర్షీద్

ICC hearing: Khurshid cross-examined, BCCI says testimony lends weight to its case

న్యూ ఢిల్లీ: భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు. తమతో ఆరు ద్వైపాక్షి సిరీస్‌లు ఆడనందుకు భారత్‌ రూ.447 కోట్లు పరిహారం చెల్లించాలని కోరుతూ పాక్‌ క్రికెట్‌ సంఘం (పీసీబీ) వేసిన ఫిర్యాదుపై ఐసీసీ విచారణ ప్రారంభించింది. ఈ విచారణకు సల్మాన్‌ హాజరయ్యారు. పాక్‌తో సిరీస్‌లు ఆడకపోవడం న్యాయమే అని అన్నారు.

ఆశ్చర్యపరిచే విధంగా విచారణకు ఖుర్షీద్‌

ఆశ్చర్యపరిచే విధంగా విచారణకు ఖుర్షీద్‌

‘విచారణకు ఖుర్షీద్‌ రావడం పాక్‌ను కచ్చితంగా ఆశ్చర్యపరిచే ఉంటుంది. మాజీ విదేశాంగ మంత్రి ఈ విచారణకు హాజరవుతారని వారు ఊహించి ఉండరు. ఖుర్షీద్‌ న్యాయ నిపుణుడు కావడం గమనార్హం. 2008లో ముంబై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించొద్దన్న యూపీయే ప్రభుత్వ వైఖరిని ఆయన తెలియజేశారు'అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

టీమిండియాను పాక్‌కు పంపించడం కుదరలేదని

టీమిండియాను పాక్‌కు పంపించడం కుదరలేదని

వివిధ ఇంటెలిజెన్స్‌ నివేదికల ప్రకారం భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌లో పర్యటించడం ప్రమాకరమని ఖుర్షీద్‌ ఐసీసీ వివాద పరిష్కార వేదిక విచారణలో తెలిపారని సమాచారం. అందుకే టీమిండియాను పాక్‌కు పంపించడం కుదరలేదని ఆయన పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ ముగింపు పలికే వరకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఖుర్షీద్‌‌తో పాటుగా మరి కొందరు:

ఖుర్షీద్‌‌తో పాటుగా మరి కొందరు:

కొన్ని కారణాల వల్ల ఖుర్షీద్‌ ముందే విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఐపీఎల్‌ మాజీ సీఈవో సుందర్‌ రామన్‌, బీసీసీఐ మాజీ జీఎం రత్నాకర్‌ శెట్టి, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌, బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్‌ పటేల్‌ విచారణకు హాజరయ్యారు.

ఈమెయిల్‌ మాత్రమే పంపిన పీసీబీ

ఈమెయిల్‌ మాత్రమే పంపిన పీసీబీ

‘మేం ఈ కేసులో గెలుస్తామన్న విశ్వాసం ఉంది. ఒక్క పేజీ ఈమెయిల్‌ మాత్రమే పంపించిన పీసీబీ ఇప్పుడు కేసు వేసింది. అది ఎంత మాత్రమూ అవగాహన ఒప్పందం కాబోదు. ‘నీకిది-నాకది'లో భాగంగా ఆ ఈమెయిల్‌ పంపించారు. వారు మా ఆదాయ విధానాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడేమో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదని పరిహారం కావాలట'అని బీసీసీఐ పేర్కొంది.

Story first published: Wednesday, October 3, 2018, 9:47 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X