న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ.165 కోట్ల కోత: ఐసీసీపై న్యాయ పోరాటానికి సిద్ధమైన బీసీసీఐ

 ICC cuts BCCI share by $23m, Board readies for legal battle

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)పై బీసీసీఐ న్యాయపోరాటానికి సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ముందు స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో బోర్డు పాలన మొత్తం సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో బీసీసీఐ కొంత బలహీన పడినమాట వాస్తవం. దీంతో ఐసీసీ బోర్డు ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనదగ్గ అంశం బోర్డుకు రావాల్సిన ఆదాయంలో భారీగా కోత విధించింది. ఈ విషయంలో పాలకుల కమిటీ గట్టిగా ఐసీసీని ప్రశ్నించలేకపోయింది.

KPL fixing: సుధీంద్ర షిండేను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులుKPL fixing: సుధీంద్ర షిండేను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ

అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ

అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బోర్డుకు కోత పెట్టిన ఆదాయం విషయంలో ఐసీసీతో తాడో పేడో తేల్చుకునేందుకు గంగూలీ సిద్ధమయ్యాడు. సుమారు రూ.165 కోట్ల వరకు కోత పెట్టిన ఐసీసీపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు.

టీ20 వరల్డ్‌కప్ 2016 సందర్భంగా

టీ20 వరల్డ్‌కప్ 2016 సందర్భంగా

భారత్‌ ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్ 2016 సందర్భంగా ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్న హామీని బీసీసీఐ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో బోర్డుకు రావాల్సిన 23 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.165 కోట్లు) ఆదాయాన్ని కోత విధించింది. ఈ విషయం తమ పరిధిలోది కాదని ఐసీసీతో బోర్డు వాదిస్తూనే ఉంది.

ఐసీసీపై న్యాయపోరాటం

ఐసీసీపై న్యాయపోరాటం

అయినా సరే ఐసీసీ మెత్తబడలేదు. దీంతో ఐసీసీతో అమీతుమీ తేల్చుకోవాలని సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఐసీసీపై న్యాయపోరాటం చేసేందుకు దుబాయ్‌కి చెందిన హెర్బర్ట్‌ స్మిత్‌ ఫ్రీహిల్స్‌ సంస్థను బీసీసీఐ నియమించుకుంది.

Story first published: Wednesday, December 4, 2019, 12:33 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X