న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకపై ఆస్ట్రేలియా ఒక్కసారి మాత్రమే ఓడింది.. ఎప్పుడంటే!!

ICC Cricket World Cup 2019: World Cup head-to-head: Australia have beaten Sri Lanka 7 times, only lost 1996 final

మెగా టోర్నీ ప్రపంచకప్‌ 2019 సమరం గురువారం నుండి ప్రారంభం కానుంది. కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1975లో తొలి వన్డే ప్రపంచకప్‌ జరిగింది. అప్పుడు వెస్టిండీస్‌ జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటివరకు 11 ప్రపంచకప్‌లు జరిగాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా 5 సార్లు కప్ గెలవగా.. భారత్, వెస్టిండీస్‌ రెండు సార్లు గెలుచుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ జట్లు చెరోసారి ట్రోఫీని ముద్దాడాయి.

అయితే ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 9 ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో శ్రీలంక, ఆస్ట్రేలియాలు తలపడగా.. ఏకంగా 7 సార్లు ఆసీస్ గెలిచింది. అయితే 1996 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. పేలుళ్లు జరగడంతో మరో మ్యాచ్‌ ఆడడానికి ఆసీస్ నిరాకరించింది. ఆసీస్ విజయాల రికార్డును ఓ సారి పరిశీలిస్తే.

1975 ప్రపంచకప్‌ గ్రూప్ మ్యాచ్:

1975 ప్రపంచకప్‌ గ్రూప్ మ్యాచ్:

ఓవల్ వేదికగా 1975 జూన్ 11న శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్‌ గ్రూప్ మ్యాచ్ జరిగింది. లంక కెప్టెన్ అనుర టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ ఓపెనర్ అలన్ టర్నర్ (101) సెంచరీ చేసాడు. మెక్ కొస్కర్ (73), గ్రేగ్ చాపెల్ (50), డగ్ వాల్టర్ (59) పరుగులు చేయడంతో.. 60 ఓవర్లలో 328 పరుగులు చేసింది. అనంతరం లంక 276 పరుగులు మాత్రమే చేసింది. సునీల్ (53), మైఖేల్ తిస్సేర (52)లు అర్ధ సెంచరీలు చేశారు.

ఆసీస్ మ్యాచ్ ఆడలేదు:

ఆసీస్ మ్యాచ్ ఆడలేదు:

1992 ప్రపంచకప్‌ గ్రూప్ మ్యాచ్. అలెన్ బోర్డర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. లంక కెప్టెన్ డిసిల్వా (62) పోరాడడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు అర్ధ సెంచరీలు చేయడంతో 44 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. 1996 ప్రపంచకప్‌ సమయంలో లంకలో పేలుళ్లు జరగడంతో ఆసీస్ మ్యాచ్ ఆడలేదు.

లంక విజయం:

లంక విజయం:

1996 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్. లంక కెప్టెన్ రణతుంగ టాస్ గెలిచి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించాడు. ఆసీస్ కెప్టెన్ టేలర్ (74) అర్ధ సెంచరీ సాధించాడు. పాయింటింగ్ (45), బేవన్ (36) రాణించడంతో ఆసీస్ 241 పరుగులు చేసింది. అనంతరం లంక ఆటగాడు డిసిల్వా (107) అజేయ సెంచరీ చేయడంతో ఆ జట్టు 44 ఓవర్లోనే విజయం సాధించి కప్ గెలిచింది.

అన్ని ఓటములే:

అన్ని ఓటములే:

2003 ప్రపంచకప్‌ సూపర్ సిక్స్ స్టేజ్ మ్యాచ్, 2003 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్, 2007 ప్రపంచకప్‌ సూపర్ ఎయిట్ స్టేజ్ మ్యాచ్, 2007 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్, 2011 ప్రపంచకప్‌ గ్రూప్ మ్యాచ్ (వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు), 2015 ప్రపంచకప్‌ గ్రూప్ మ్యాచ్‌లలో ఆసీస్ జయభేరి మోగించింది.

Story first published: Wednesday, May 29, 2019, 12:59 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X