న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సలహా పాటించకపోవడం వల్లే పాక్ ఓడిపోయిందా?

ICC Cricket World Cup 2019: Wasim Akram says tired of giving advice to Pakistani team

హైదరాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తీవ్రంగా తప్పుబట్టాడు. తుది జట్టులో ఐదుగురు స్పెష‌లిస్టు బౌల‌ర్ల‌ు ఉంటే... టాస్ గెలిచిన త‌ర్వాత ఎలా బౌలింగ్‌ను తీసుకున్నావని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను అక్రమ్ ప్ర‌శ్నించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పాక్ జ‌ట్టుకు తాను స‌ల‌హాలు ఇచ్చి ఇచ్చి అల‌సిపోయాన‌ని చెప్పుకొచ్చాడు. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన హై ఓల్డేజ్ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం వసీం అక్రమ్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో పైవ్యాఖ్యలు చేశాడు.

ఐదుగురు స్పెష‌లిస్టు బౌల‌ర్ల‌తో

ఐదుగురు స్పెష‌లిస్టు బౌల‌ర్ల‌తో

ఆదివారం మాంచెస్ట‌ర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్‌ అహ్మద్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఐదుగురు స్పెష‌లిస్టు బౌల‌ర్ల‌తో బ‌రిలోకి దిగింది. ఐదుగురు బౌల‌ర్లు ఉన్నారంటే, ఓ స్పెష‌లిస్టు బ్యాట్స్‌మెన్‌ను మ‌నం మిస్స‌వుతున్నామ‌న్న‌ట్లే అని అక్రమ్ చెప్పుకొచ్చాడు.

బౌలింగే మ‌న బ‌లమని చెప్పినా

బౌలింగే మ‌న బ‌లమని చెప్పినా

అలాంటి స‌మ‌యంలో బౌలింగే మ‌న బ‌లమని, దీంతో మ‌నం టార్గెట్ ఇచ్చి డిఫెండ్ చేయాల‌ని సూచించాడు. ఇలాంటి స‌ల‌హాలు ఎన్నో ఇచ్చాన‌ని, కానీ పాక్ జ‌ట్టు త‌న స‌ల‌హాల‌ను స్వీక‌రించ‌లేద‌ని వసీం అక్రమ్ తెలిపాడు. గ‌తంలో కౌంటీల్లో లాంకిషేర్ జట్టుకు వసీం అక్రమ్ ప్రాతినిథ్యం వహించాడు.

నా సలహాలను ఎవరూ తీసుకోలేదు

నా సలహాలను ఎవరూ తీసుకోలేదు

ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులు అత‌నికి బాగా తెలుసు. కానీ, అతడి స‌ల‌హాల‌ను పాక్ కెప్టెన్‌తో పాటు జట్టు మేనేజ్ మెంట్ సైతం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. "నేను ఇక్కడి ఉన్నాను. ఇక్కడ ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. ఆటగాళ్లను గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ, నా సలహాలను ఎవరూ తీసుకోలేదు" అని వసీం అక్రమ్ అన్నాడు.

భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ ప్రధాని ట్వీట్

భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ ప్రధాని ట్వీట్

మరోవైపు పాక్ ప్ర‌ధాని, మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్ ఖాన్ కూడా భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు ఓ ట్వీట్ చేశారు. పిచ్‌, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పాక్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల‌ని సూచించారు. అంతేకాదు అలాగే స్పెషలిస్టు బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని సలహా ఇచ్చారు.

ఇరు జట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో

ఇరు జట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో

కీలకమ్యాచ్ కావడంతో ఇరు జట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్‌ ఆడుతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కానీ, టాస్‌ గెలిచిన సర్ఫరాజ్‌ ఇమ్రాన్ స‌ల‌హాను పాటించలేదు.

Story first published: Monday, June 17, 2019, 15:19 [IST]
Other articles published on Jun 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X