ప్రపంచకప్‌.. భారత్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

ప్రపంచకప్‌ సమరాన్ని భారత్‌ ఓటమితో ఆరంభించింది. ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిని ఎదుర్కొంది. భారత్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పూర్తిగా పూర్తిగా విఫలమయి మూల్యం చెల్లించుకుంది. భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తడబడ్డా నిలిచారు:

తడబడ్డా నిలిచారు:

180 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుప్తిల్ (22) ధాటిగా ఆడే క్రమంలో పాండ్యా కు చిక్కాడు. ఈ దశలో కెప్టెన్ విలియమ్సన్‌ (67; 87 బంతుల్లో 6x4, 1x6), రాస్‌ టేలర్‌ (70; 73 బంతుల్లో 8x4)లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. ఈ జోడి మూడో వికెట్‌కి 114 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్థ శతకాలు సాధించారు.

బ్లండెల్‌తో కలిసి:

బ్లండెల్‌తో కలిసి:

అయితే చహల్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి విలియమ్సన్‌ రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హెర్నీ నికోలస్ (15) టేలర్‌కు అండగా నిలబడ్డాడు. అయితే విజయానికి 1 పరుగు అవసరం కాగా.. టేలర్ ఔట్ అయ్యాడు. టామ్‌ బ్లండెల్‌తో కలిసి నికోలస్ కావాల్సిన ఒక్క పరుగు చేసి కివీస్‌కు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో బుమ్రా, చహల్, పాండ్యా, జడేజా తలో వికెట్ తీశారు.

టాప్‌ ఆర్డర్‌ విఫలం:

టాప్‌ ఆర్డర్‌ విఫలం:

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా కు ఆదిలోనే షాక్ తగిలింది. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ దాటికి ఓపెనర్లు రోహిత్‌ శర్మ(2), శిఖర్ ధావన్‌ (2), కేఎల్ రాహుల్‌ (6)లు పెవిలియన్‌కు చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (18), హార్దిక్‌ పాండ్య (30; 37 బంతుల్లో 6x4), ఎంఎస్ ధోనీ (17), దినేష్ కార్తీక్ కార్తీక్‌ (4)లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 91 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.

 ఆదుకున్న జడేజా:

ఆదుకున్న జడేజా:

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ జడేజా (54; 50 బంతుల్లో 6x4, 2x6) జట్టును ఆదుకున్నాడు. భువి సహాయంతో కొద్దిసేపు జడేజా ఇన్నింగ్స్ ను నడిపించాడు. అనంతరం కుల్దీప్‌ (19)తో విలువైన పరుగులు జోడించాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ అర్ధ శతకం చేసాడు. ఈ జోడి రాణించడంతో మిండియా కనీసం గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. రెండు పరుగుల వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్‌ బౌలర్లు బౌల్ట్‌ నాలుగు, నీషమ్‌ మూడు వికెట్లతో రాణించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 26, 2019, 9:53 [IST]
Other articles published on May 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X