న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టోర్నీకే హైలైట్‌గా: వరల్డ్‌కప్‌లో తప్పక చూడాల్సిన మ్యాచ్‌లివే

ICC World Cup 2019: Top 4 Best Matches To Watch In This World Cup 2019!! | Oneindia Telugu
 ICC Cricket World Cup 2019: These are the best matches to watch

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ మహా సంగ్రామం కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు టోర్నీకే హైలైట్‌గా నిలవనున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...

జూన్‌ 9, లండన్‌: ఇండియా vs ఆస్ట్రేలియా

జూన్‌ 9, లండన్‌: ఇండియా vs ఆస్ట్రేలియా

వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-2తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌ లేకుండా ఆ సిరీస్‌‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పుడు వీరిద్దరూ జట్టులో

చేరడంతో ఆసీస్ జట్టు మరింత పటిష్టంగా ఉంది. ఇక, కోహ్లీసేన బలమైన టాపార్డర్ కలిగి ఉన్నప్పటికీ అద్బుతమైన బౌలింగ్ ఆస్ట్రేలియా సొంతం. ఐదుసార్లు ఛాంపియన్‌ నిలిచిన ఆస్ట్రేలియాను ఈ మ్యాచ్‌లో భారత్ ఎలా ఎదుర్కొంటునేది ఆసక్తికరంగా ఉంది. వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 11సార్లు తలపడగా ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

జూన్‌ 16, మాంచెస్టర్‌: ఇండియా vs పాకిస్థాన్‌

జూన్‌ 16, మాంచెస్టర్‌: ఇండియా vs పాకిస్థాన్‌

టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహాం లేదు. దాయాది దేశాల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి మ్యాచ్ మరింత ఉద్వేగభరితంగా సాగనుంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై ఎప్పుడూ టీమిండియాదే పైచేయి. అయితే, ఈ టోర్నీలో భారత్‌పై విజయం సాధించాలని పాక్ కోరుకుంటోంది. వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే గెలిచింది.

జూన్‌ 25, లండన్‌: ఇంగ్లాండ్‌ vs ఆస్ట్రేలియా

జూన్‌ 25, లండన్‌: ఇంగ్లాండ్‌ vs ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. యాషెస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ తలపడితే యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తుంది. దీంతో వరల్డ్‌కప్‌లో కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరమే. వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరగ్గా 5 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా... ఇంగ్లాండ్‌ రెండేసార్లు గెలిచింది.

జూన్‌ 29, లీడ్స్‌: పాకిస్థాన్‌ vs అఫ్గానిస్థాన్‌

జూన్‌ 29, లీడ్స్‌: పాకిస్థాన్‌ vs అఫ్గానిస్థాన్‌

ఆప్ఘనిస్థాన్ పసికూన అయినప్పటికీ ఆ జట్టుని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్ అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ రవసత్తరంగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జులై 4, హెడెంగ్లే: ఆప్ఘనిస్థాన్ vs వెస్టిండిస్

జులై 4, హెడెంగ్లే: ఆప్ఘనిస్థాన్ vs వెస్టిండిస్

ఈ మధ్య కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆప్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. టోర్నీలో భాగంగా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండిస్ జట్టుతో ఆప్ఘన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆప్ఘన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో వెస్టిండిస్‌పై ఆప్ఘనిస్థాన్ రెండు సార్లు విజయం సాధించడమే. నిజానికి ఈ వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టుని తక్కువ అంచనా వేయకపోవడమే మంచింది.

మే 30, లండన్‌: ఇంగ్లాండ్‌ vs దక్షిణాఫ్రికా

మే 30, లండన్‌: ఇంగ్లాండ్‌ vs దక్షిణాఫ్రికా

టోర్నీ ఆరంభ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు బలమైన జట్లు అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్‌‌కప్ ట్రోఫీని నెగ్గలేకపోయాయి. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ నిలకడగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఉన్న రికార్డు ఈ మ్యాచ్‌పై ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఆరుసార్లు తలపడగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ చెరో మూడుసార్లు విజయం సాధంచాయి.

Story first published: Tuesday, May 28, 2019, 14:54 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X