న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్‌‌లో ఇంత మార్పు తీసుకొచ్చిందా!

ICC Cricket World Cup 2019: The struggles that make David Warner’s 166 sweet

హైదరాబాద్: బాల్‌టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ పూర్తిగా మారిపాయాడా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. నిజానికి బాల్ టాంపరింగ్ ఘటనకు ముందు వార్నర్ మైదానంలో చాలా దూకుడుకుగా వ్యవహారించేవాడు. మైదానంలో ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగడంతో పాటు వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడంలో ముందుంటాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వార్నర్ తన పునరాగమనంలో పూర్తిగా మారిపోయాడు. అతడి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. అందుకు ఈ ప్రపంచకప్‌లో చోటు చేసుకున్న రెండు ఘటనలే నిదర్శనం. పాక్‌పై సెంచరీ సాధించడంతో లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఓ బుల్లి అభిమానికి కానుకగా ఇచ్చాడు.

స్పృహ కోల్పోయిన నెట్ బౌలర్ జై కిషన్‌

స్పృహ కోల్పోయిన నెట్ బౌలర్ జై కిషన్‌

ఇక, ప్రాక్టీస్ సెషన్‌లో తాను కొట్టిన బంతి తగిలి స్పృహ కోల్పోయిన భారత సంతతికి చెందిన నెట్ బౌలర్ జై కిషన్‌ను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించిన వార్నర్... ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆసీస్ జట్టు సభ్యులు సంతకాలు చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చి.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసేందుకు టికెట్లు ఇచ్చాడు.

ఒక్క సారి లయ అందుకుంటే వార్నర్‌ను ఆపడం కష్టం

ఒక్క సారి లయ అందుకుంటే వార్నర్‌ను ఆపడం కష్టం

ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఒక్క సారి లయ అందుకుంటే డేవిడ్ వార్నర్‌ను ఆపడం చాలా కష్టం. మెగాటోర్నీకి ముందు ఒక కార్యక్రమంలో డేవిడ్ వార్నర్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్, ప్రస్తుత అసిస్టెంట్ కోచ్ రికీ పాంటింగ్ అన్న మాటలివి. ఆ మాటలను నిజం చేస్తూ ఈ ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ పరుగులు వరద పారిస్తున్నాడు.

447 పరుగులతో అగ్రస్థానం

ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 89.40 యావరేజితో 447 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (166 పరుగులు) నమోదు చేసిన ఆటగాడు కూడా వార్నరే కావడం విశేషం.

అన్నీ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటిన వార్నర్

అన్నీ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటిన వార్నర్

ఈ ప్రపంచకప్‌లో వార్నర్ ఇప్పటివరకు చేసిన పరుగులు 89*, 3, 56, 107, 26, 166. విండీస్‌తో మ్యాచ్‌లో మినహా మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. ఆఫ్ఘన్‌తో పోరులో తొలి వికెట్‌కు ఆరోన్ ఫించ్‌తో కలిసి 96 పరుగులు జోడించిన వార్నర్, భారత్‌పై 61 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.

ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర

ఇక, పాకిస్థాన్‌పై సెంచరీ (107) నమోదు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. శ్రీలంకపై 26 పరుగులే చేసినా.. తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు కెప్టెన్‌తో కలిసి 121 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Friday, June 21, 2019, 13:59 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X