న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్‌ ఎప్పుడూ సంచలనమే.. ఎక్కడున్నా ఎంటర్‌టైన్‌మెంటే

ICC Cricket World Cup 2019:The Always Bright World Of 'Universe Boss' Gayle || Oneindia Telugu
ICC Cricket World Cup 2019:The always bright world of Universe Boss Gayle

విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వెస్టిండిస్ క్రికెటర్, 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ క్రికెట్‌లో ఎప్పుడూ సంచలనమే. మైదానంలో, బయట ఎక్కడైనా అతను ఉంటే ఎంటర్‌టైన్‌మెంటే. బ్యాట్‌తో పరుగుల ప్రవాహం పారించగలడు, బంతితో మాయ కూడా చేయగలడు. ఇక క్యాచ్ అందుకుంటే మైదానంలో డాన్సులు చేయాల్సిందే . అతను ఎక్కడున్నా అభిమానులకు మాత్రం పండగే. ముఖ్యంగా బ్యాట్‌తో ప్రపంచానికి తన ఉనికిని చాటాడు. మీడియా, మైదానం, ఇల్లు అనే తేడా లేకుండా ఒకే విధంగా ఉంటాడు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలిపింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గొప్పవాళ్ళలలో నేనూ ఉన్నా:

గొప్పవాళ్ళలలో నేనూ ఉన్నా:

వెస్టిండీస్ బ్యాటింగ్‌లో మీ స్థానం ఎక్కడా అని అడిగినందుకు.. 'సందేహం లేదు. నేను గొప్పవాళ్ళలలో ఖచ్చితంగా ఉన్నాను' అని తడుముకోకుండా చెప్పాడు. అయితే అహంకారంతో కాకుండా చిరునవ్వుతో సమాధానం ఇవ్వడంతో తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అని అందరూ అనుకుంటారు. అయితే బౌలర్లను ఈ విషయం అడిగితే మాత్రం కెమెరాల ముందు లేదు అని సమాధానమిస్తారు. అదే కెమెరా వెనుక ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా నిజమే అని చెప్తారని గేల్ స్వయంగా వెల్లడించడం విశేషం.

నిరూపించుకోవడానికి ఏమీ లేదు:

నిరూపించుకోవడానికి ఏమీ లేదు:

ఏదో ఒక సమయంలో క్రికెట్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఆటను వదలాల్సిన అవసరం లేదు అని గేల్ చెప్పినట్టే చేస్తున్నాడు. అభిమానులు ఎప్పుడూ అతని నుండి సిక్సులు మాత్రమే కోరుకుంటారు. వారి అభిమానమే అంచనాలకు మించి ఆడేలా చేస్తోంది. గేల్ నిరూపించుకోవడానికి ఇంకా ఏమీ మిగిలి లేదు కేవలం వరల్డ్‌కప్‌ను గెలుచుకోవడం తప్ప

రెండు టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు:

రెండు టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు:

గత కొన్నేళ్లుగా గేల్ టెస్టుల్లో రాణించాడు. అతను రెండు టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు చేసి నలుగురు బ్యాట్స్‌మెన్లలో ఒకడుగా నిలిచాడు. 2010 నవంబర్‌లో శ్రీలంకపై 333 పరుగులు చేశాడు. ఐదు సంవత్సరాల తరువాత దక్షిణాఫ్రికాపై 317 పరుగులు ఆంటిగ్వాలో చేసాడు. 103 టెస్టులలో 42.18 సగటున 7214 పరుగులు చేశాడు. 10,345 వన్డే ఇంటర్నేషనల్ పరుగులు మరియు 1,627 టీ20 పరుగులు చేసాడు.

 మరో ట్విస్ట్:

మరో ట్విస్ట్:

ప్రపంచ‌క‌ప్ మెగా టోర్న‌మెంట్ ముగిసిన త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాన‌ని ఇంత‌కుముందే ప్ర‌క‌టించాడు క్రిస్ గేల్‌. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో గురువారం వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టు టీమిండియాతో త‌లప‌డ‌బోతోంది. ఈ మ్యాచ్ కోసం విండీస్ జ‌ట్టు ముమ్మ‌రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ప్రాక్టిస్ ముగించుకున్న అనంత‌రం క్రిస్ గేల్ విలేక‌రుల‌తో మాట్లాడాడు. ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత త‌న భ‌విష్య‌త్ ప్రణాళిక‌ను వెల్ల‌డించాడు. 'రిటైర్‌మెంట్‌కు ఇంకా స‌మ‌యం ఉంది. ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే టీమిండియాతో సిరీస్‌లో ఆడ‌బోతున్న‌. టీ20 మ్యాచులు మిన‌హా వ‌న్డే, టెస్ట్ సిరీస్‌లో తాను జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌టం ఖాయ‌మైంద‌ని' చెప్పుకొచ్చాడు.

1
43677

{headtohead_cricket_3_8}

Story first published: Thursday, June 27, 2019, 10:42 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X