న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌.. మలింగ అరుదైన ఘనత

ICC Cricket World Cup 2019, Sri Lanka vs India: Lasit Malinga Ends His World Cup Career as the 3rd Highest Wicket Taker

శ్రీలంక సీనియర్ పేసర్, స్పీడ్‌ స్టర్ లసిత్ మలింగ టీమిండియాపై కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడాడు. శనివారం భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో లసిత్‌ మలింగ ఒక వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా మలింగ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మూడో బౌలర్‌గా:

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఓపెనర్ కేఎల్ రాహుల్ (111)ను ఔట్ చేసాడు. దీంతో మొత్తం ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో మలింగ 56 వికెట్లు తీసాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌ (55)ను అధిగమించి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ (71), శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (68) ముందున్నారు.

12 వికెట్లు:

12 వికెట్లు:

ప్రస్తుత ప్రపంచకప్‌లో మలింగ మొత్తం 12 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో మలింగ 219 ఇన్నింగ్స్‌లలో 335 వికెట్లు సాధించాడు. 11 సార్లు నాలుగు వికెట్లను సాధించగా.. 8 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్నాడు. ముత్తయ్య మురళీ ధరన్‌ (523), చమిందా వాస్‌ (399)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:

నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:

కరీబియన్ దీవుల్లో జరిగిన 2007 ప్రపంచకప్‌లో మలింగ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జార్జ్ టౌన్‌లోని ప్రావిడెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు.

రెండో ప్రపంచకప్‌ హ్యాట్రిక్:

రెండో ప్రపంచకప్‌ హ్యాట్రిక్:

ఆసియా ఉపఖండం ఆతిథ్యం ఇచ్చిన 2011 ప్రపంచకప్‌లో మలింగ రెండో ప్రపంచకప్‌ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ దాటికి తన్మయ్ మిశ్రా, పీటర్ ఒంగాండో, షెమ్ ఎంగోచి వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో ప్రపంచకప్‌ చరిత్రలో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా లసిత్ మలింత అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Monday, July 8, 2019, 12:42 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X