న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గానిస్థాన్‌నే కాదు.. ఏ జట్టును తేలిగ్గా తీసుకోం: కోహ్లీ

ICC Cricket World Cup 2019 : Kohli Says 'India Won't Take Afghanistan Or Any Other Team Lightly'
ICC Cricket World Cup 2019, Pakistan vs India: India wont take Afghanistan or any other team lightly says indian Skipper Virat Kohli

ఆఫ్ఘనిస్థాన్‌ జట్టునే కాదు ప్రపంచకప్‌ టోర్నీలోని ఏ జట్టును తేలిగ్గా తీసుకోబోమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. చిరకాల ప్రత్యర్థిపై పాకిస్థాన్‌పై 89 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. విజయం అనంతరం ప్రపంచకప్‌ కామెంటరీ ప్యానెల్‌లో భాగంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ పలు విషయాలను పంచుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఏ జట్టును తేలిగ్గా తీసుకోం:

ఏ జట్టును తేలిగ్గా తీసుకోం:

విరాట్ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి. ప్రపంచకప్‌లో పాల్గొన్న అన్ని జట్లూ బాగా ఆడుతున్నాయి. మా తదుపరి మ్యాచ్‌ అఫ్గానిస్థాన్‌తో ఆడనున్నాం. ఏ జట్టయినా ఒకే తీరులో సన్నద్ధమవుతాం. ఆఫ్ఘనిస్థాన్‌ జట్టునే కాదు ప్రపంచకప్‌ టోర్నీలోని ఏ జట్టును తేలిగ్గా తీసుకోం. ప్రతి మ్యాచ్‌కు ప్రణాళికలను రచిస్తాం. వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం' అని కోహ్లీ తెలిపారు.

ఎంజాయ్ చేయడం ముఖ్యం:

ఎంజాయ్ చేయడం ముఖ్యం:

ఇంగ్లండ్‌కు వచ్చినప్పుడే సరదాగా ఉండాలని అనుకున్నాం. ఇది సుదీర్ఘ టోర్నీ. ప్రతి రోజును ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యం. 5, 10 నిమిషాల సంతోషకరమైన సమయంతో కొత్తగా ఉంటుంది. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు తప్ప.. ప్రాక్టీస్ సెషన్‌లో కూడా మేం జోకులు వేసుకుంటాం. ప్రస్తుతం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉత్సాహ వాతావరణం ఉంది' అని కోహ్లీ చెప్పారు.

పాక్ విజయం ప్రత్యేకం:

పాక్ విజయం ప్రత్యేకం:

దక్షిణాఫ్రికాపై తొలి విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తొలి మ్యాచ్‌ విజయం ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. వర్షం కారణంగా ఒక్క మ్యాచ్‌ రద్దయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పెద్ద జట్లపై విజయం జట్టు సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది. పాక్ విజయం ప్రత్యేకం. ఈ విజయాలు అన్ని జట్టు సమిష్టి కృషి. అందరూ బాగా రాణించారు' అని కోహ్లీ పేర్కొన్నారు.

ఇద్దరూ ప్రమాదకారులే:

ఇద్దరూ ప్రమాదకారులే:

మ్యాచ్‌కు మధ్య ఎక్కువ వ్యవధి ఉండడం కాస్త మేలు చేస్తుంది. నూతనోత్సాహంతో బరిలోకి దిగేందుకు ఉపయోగపడుతోంది. ప్రపంచకప్‌లో ప్రణాళికలను పక్కాగా అమలు చేయాల్సిందే. మణికట్టు స్పిన్నర్లు ఎప్పుడూ ప్రమాదకారులే. వారి బౌలింగ్‌కు తగ్గట్టు ఫీల్డింగ్‌ను పెట్టడం, సరైన ప్రదేశంలో స్లిప్‌ను పెట్టాలి. మధ్య ఓవర్లలో చాహల్‌, కుల్దీప్‌ ఇద్దరూ ముఖ్యమే' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, June 20, 2019, 10:43 [IST]
Other articles published on Jun 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X