
సచిన్, హెడెన్ తర్వాత:
ఇక ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కూడా షకీబ్ గుర్తింపు పొందాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ 2007 ప్రపంచకప్‌లో 659 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత షకీబ్ (606) ఉన్నాడు. బంగ్లా టోర్నీ నుండి నిష్క్రమించడంతో సచిన్, హెడెన్‌ల రికార్డులకు షకీబ్ నుండి ఎలాంటి ప్రమాదం లేదు.

ఏకైక ఆటగాడు:
ఒకే ప్రపంచకప్‌లో 600 పరుగులు, 10 వికెట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా షకీబ్ అల్ హసన్ రికార్డు సృష్టించాడు. ఒకే ప్రపంచకప్‌లో ఏడు అర్ధ సెంచరీలు చేసిన రెండవ క్రికెటర్‌గా కూడా షకీబ్ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ప్రపంచకప్‌లలో 12 అర్ధ సెంచరీలు చేసి శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర సరసన నిలిచాడు.

62 పరుగుల దూరంలో:
అయితే సచిన్ (673) రికార్డుకు మాత్రం భారత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మ 544 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 516 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్, భారత్ సెమీస్ చేరడంతో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. సచిన్ రికార్డును బద్దలుకొట్టాలంటే రోహిత్‌కు మరో 130 పరుగులు అవసరం. ఇక గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన షకీబల్ హసన్ (606) రికార్డును చేరాలంటే రోహిత్ మరో 62 పరుగులు చేయాలి. రోహిత్ మరొక్క సెంచరీ సాధిస్తే ఒకే ప్రపంచకప్‌లో 5 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.


Click it and Unblock the Notifications
