న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార‌త్ మ్యాచ్ త‌ర‌వాతే.. భార్య, పిల్లలకు అనుమతి

ICC Cricket World Cup 2019 : PCB Allows Families To Stay With Pak Players After India Match
ICC Cricket World Cup 2019: Pakistan board allows families to stay with players after India match

ఇంగ్లాండ్‌ వేదికగా త్వరలో జరగబోయే ప్రపంచకప్‌లో ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉండేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అనుమతించింది. కానీ జూన్ 16న తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌తో కీలక మ్యాచ్‌ ముగిసిన తర్వాతే కుటంబ సభ్యులను తీసుకెళ్లాలనే షరతు పెట్టింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సమయంలో తమ కుటుంబాలను ఆటగాళ్లతో తీసుకెళ్లేందుకు పీసీబీ అనుమతించింది. అయితే ప్రపంచకప్‌ జరిగేటపుడు కూడా ఇదే విధంగా అనుమతించాలని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గత నెలలో చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.

తాజాగా జూన్‌ 12న ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్‌ చూసేందుకు తమ భార్యా, పిల్లలను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని పాక్‌ ఆటగాళ్లు బోర్డును కోరగా.. జూన్‌ 16న భారత్‌తో మ్యాచ్‌ ముగిశాకే తీసుకెళ్లాలని బోర్డు స్పష్టం చేసింది. 'మిగతా జట్ల బోర్డు వైఖరిని చూసిన తర్వాత పాక్ బోర్డు తన పాత నిర్ణయాన్ని సమీక్షించాలని నిర్ణయించినట్టు' ఓ పీసీబీ అధికారి చెప్పారు. ప్రపంచకప్‌లో పాక్ జట్టు తన ప్రారంభ మ్యాచ్‌ను మే 31న వెస్టిండీస్ తో ఆడనుంది.

ప్రపంచకప్‌ సన్నాహాకంలో భాగంగా శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. ఇమామ్ (32), ఆజాం (12), మాలిక్ (44) రాణించారు. అనంతరం పాక్ బౌలర్లు తడబడడంతో అఫ్గాన్ చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఆదివారం రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుతో పాక్ తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇంకా టాస్ పడలేదు.

Story first published: Sunday, May 26, 2019, 16:17 [IST]
Other articles published on May 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X