న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ICC Cricket World Cup 2019, New Zealand vs Pakistan: New Zealand have won the toss and have opted to bat

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా మరోకొద్ది సేపట్లో న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. వర్షం కారణంగా ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ ఆలస్యంగా వేశారు. మ్యాచ్ మరో 30 నిమిషాల్లో ప్రారంభం కానుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అపజయమే లేకుండా దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ సెమీఫైనల్స్‌ బెర్తుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడినా.. న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మరోవైపు పాక్ పరిస్థితి అలా లేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన పాక్‌ మూడు ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దయింది. దీంతో పాక్ 5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో కివీస్ మ్యాచ్ గెలవాల్సిందే. ఒకవేళ వర్షం పది రద్దయినా సెమీస్ ఆశలు గల్లంతే.

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు జరగ్గా.. 54 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌, కివీస్‌ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా.. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లోనూ న్యూజి లాండ్‌పై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. మొత్తం 8 మ్యాచ్‌లాడగా.. ఆరింట్లో పాక్, రెండింట్లో కివీస్‌ గెలుపొందాయి.

జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్ హోమ్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, లుకీ పెర్గుసన్.

పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్, వికెట్ కీపర్), హరీస్ సోహైల్, ఇమద్ వసీం, వాహబ్ రియాజ్, షాదబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది, మహ్మద్ అమీర్.

Story first published: Wednesday, June 26, 2019, 15:51 [IST]
Other articles published on Jun 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X