కేదార్ జాదవ్ రిక్వెస్ట్: ఓ వర్షం మహారాష్ట్రకు వెళ్ళొచ్చుగా

ICC Cricket World Cup 2019 : Kedar Jadhav Pleads Rain Gods To Move From Nottingham || Oneindia

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అందరూ అనుకున్నట్లుగానే వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్‌హామ్‌లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. దీంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే ఈ మ్యాచ్‌ రద్దయిపోయింది. వర్షం ఆగిన తర్వాత కూడా మైదానం ఆటకు సిద్ధంగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకూ ఒక్కో పాయింట్‌ కేటాయించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్ సాగాలని ఎదురుచూపులు:

మ్యాచ్ సాగాలని ఎదురుచూపులు:

మ్యాచ్ రద్దవడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఆట చూద్దామని వెళ్లిన వారంతా గొడుగులు వేసుకుని నిలబడ్డారు. మరోవైపు వానదేవుడు కరుణించి మళ్లీ ఆడే అవకాశం రావాలని మన క్రికెటర్లు ఆకాశం వైపు చూస్తూ నిరీక్షించారు. బాల్కనీ నుంచి రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌లు బ్రెడ్‌ ఆమ్లెట్‌ తింటూ మ్యాచ్ సాగాలని కోరుకున్నారు.

మహారాష్ట్రకు వెళ్ళొచ్చుగా:

అయితే వర్షం పడటం పట్ల కేదార్‌ జాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు జాదవ్ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. జాదవ్ మేఘాల వైపు చూస్తూ.. ఓ వర్షం ఇక్కడి నుండి మహారాష్ట్రకు వెళ్ళొచ్చుగా అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. సొంత రాష్ట్రంపై జాదవ్ చూపే ప్రేమను భారత అభిమానులు కొనియాడుతున్నారు.

తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు:

తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు:

జాదవ్‌ సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో వర్షపాతం చాలా తక్కువ. దీంతో రోజురోజుకి నీటి సమస్య అధికమవుతోంది. ఇప్పుడు అక్కడి జనాలు ఎండలతో అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. అనేక ప్రాంతాల్లో సాగు నీటితో పాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వరుణుడిని తన ప్రాంతానికి వెళ్లాలని జాదవ్‌ కోరాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 14, 2019, 9:35 [IST]
Other articles published on Jun 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X