
శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ పాఠశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే చెన్నైలోని ఓ పాఠశాల విద్యార్థులు మాత్రం వినూత్నరీతిలో టీమిండియాపై అభిమానం చాటుకున్నారు. యోగా డే సందర్బంగా ప్రపంచకప్‌లో ఆడుతున్న టీమిండియా తమ మద్దతు తెలిపారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
శుక్రవారం చెన్నై పాఠశాల విద్యార్థులు మైదానంలో ప్రపంచకప్ ఆకృతిలో నిల్చుని టీమిండియాపై అభిమానం చాటుకున్నారు. టీమిండియా ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షించారు. టీమిండియాకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫొటోను క్రికెట్ ప్రపంచకప్ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటో భారత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చాలా మంది లైక్ చేస్తూ రీట్వీట్లు, కామెంట్లు పెడుతున్నారు. 'యోగా దినోత్సవం సందర్భంగా టీమిండియాపై చెన్నై విద్యార్థులు చూపిన అభిమానం అమోగం. టీమిండియాపై వారికి ఉన్న నిబద్ధత అద్భుతం' అని క్రికెట్ ప్రపంచకప్ పేర్కొంది.
టీమిండియా శనివారం తన తదుపరి మ్యాచ్‌ను అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. టీమిండియా ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. మూడు విజయాలు సాధించింది. కివీస్ మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్థాన్ లాంటి పటిష్ట జట్ల మ్యాచ్‌లను పూర్తిచేసుకుంది. అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.