న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ.. గెలిస్తే సెమీస్‌కు భారత్‌

ICC Cricket World Cup 2019: India vs England Match Preview: Probable Playing XI, Weather, Pitch Report, india eye semis spot, elimination threat looms over hosts

వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు చేరుకుంటుంది. టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. అనూహ్య పరాజయాలతో సెమీస్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాల్సిన పరిస్థితి. అయితే ఈ మ్యాచ్‌ ఓడితే ఇంగ్లాండ్‌ సెమీస్‌ అవకాశాలు మరింత తగ్గుతాయి. దీంతో ఒత్తిడంతా ఇంగ్లాండ్‌పైనే ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

శంకర్‌కు మరో చాన్స్‌ :

శంకర్‌కు మరో చాన్స్‌ :

అఫ్గానిస్థాన్‌పై కష్టపడ్డ భారత్‌.. వెస్టిండీస్‌పై మంచి విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 268 పరుగులు చేసిన భారత్‌.. వెస్టిండీస్‌ను 143 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో అన్ని విభాగాల్లో రాణించింది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్‌.. ఈసారి ఒక భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిందే. కెప్టెన్ కోహ్లీ నుంచి అదే నిలకడను భారత్‌ ఆశిస్తోంది. టాప్ ఆర్డర్‌లో ఒకరు రాణిస్తున్నా.. నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ విఫలమవుతున్నాడు. జట్టులో శంకర్‌ అవసరమా? అనే వాదన వస్తోంది. అయితే కోహ్లీ అతనే ఓటేస్తున్నాడు. మిడిలార్డర్‌ తడబడుతున్నా.. హార్దిక్, ధోనీ , జాదవ్‌ తలో చేయి వేస్తే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. భారత పేసర్లు బుమ్రా, షమీలకు ఈ మ్యాచ్‌ సరైన సవాల్‌. రాయ్, బట్లర్, మోర్గాన్‌ వంటి హార్డ్‌ హిట్టర్లును ఆపగలిగితే మనకు తిరుగుండదు. చహల్, కుల్దీప్, హార్దిక్లు మధ్య ఓవర్లలో ప్రభావం చూపనున్నారు.

ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే:

ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే:

వరుసగా రెండు పరాజయాలతో ఇంగ్లండ్‌ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. రూట్‌ నిలకడ చూపుతున్నా.. మోర్గాన్, బట్లర్‌ కీలక సమయంలో విఫలమవడం దెబ్బకొట్టింది. మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. కండరాల గాయంతో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ పునరాగమనంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఫామ్‌ ఒక్కటే ఊరట. పేసర్లు ఆర్చర్, వుడ్‌ భారత మంచి ఫేమ్ కనబరుస్తున్నారు. వీరికి తోడు స్టోక్స్‌, రషీద్, మొయిన్‌ అలీ ఉన్నారు. అందరూ రాణిస్తే మనోళ్లకు పరుగులు చేయడం కష్టమే.

వర్షం ముప్పు లేదు:

వర్షం ముప్పు లేదు:

మ్యాచ్‌కు వేదికైన ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం పిచ్‌ టోర్నీలోనే బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలమైనది. ఇరు జట్లను చూస్తే భారీ స్కోర్లు ఖాయం. 2015లో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌ జట్టు 408/5 స్కోరు సాధించింది. కానీ తాజాగా ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 245 పరుగులే అత్యధికం. ఈ రెండు సార్లు కూడా ఛేజింగ్‌ జట్టే గెలిచింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. వెస్టిండీ్‌సతో మ్యాచ్‌ సాగినట్టే ఈ రోజు కూడా అభిమానులు ఫుల్‌ ఎంజాయ్‌ చేయవచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలు ఉండనుంది.

ముఖాముఖి రికార్డు:

ముఖాముఖి రికార్డు:

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్‌ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 41 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. రెండు టై కాగా.. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో భాగంగా ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో మూడింట్లో నెగ్గాయి. ఒకటి ‘టై'గా ముగిసింది. 2011లో భారత్‌ వేదికగా జరిగిన కప్‌లో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ సమం చేసింది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా , కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్: జేసన్ రాయ్, జాన్నీ బెయిర్‌స్టో, జోయ్ రూట్, : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.

Story first published: Sunday, June 30, 2019, 13:30 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X