న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ కోహ్లీ సెంచరీ చేయి.. నిరాశ పరచొద్దు'

ICC Cricket World Cup 2019: Kevin Pietersen Urges Virat Kohli To Slam A Ton Against Australia!!
ICC Cricket World Cup 2019, India vs Australia: Kevin Pietersen urges Virat Kohli to slam a ton against Aaron Finch & Co

మరికొద్దిసేపట్లో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభమయ్యే మ్యాచ్‌లో భారతే హాట్‌ ఫేవరెట్‌ అని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, స్పీడ్ స్టర్ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోరుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 ఆస్ట్రేలియాపై కోహ్లీ రికార్డు:

ఆస్ట్రేలియాపై కోహ్లీ రికార్డు:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఏ దేశంపైనా అయినా విరాట్ అలవోకగా పరుగులు చేయగలడు. స్వదేశీ గడ్డపైనా, విదేశీ గడ్డపైనా అనే తేడా లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో కూడా కోహ్లీ రాణించాడు. ఆస్ట్రేలియాపై కోహ్లీ గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. విరాట్ 36 మ్యాచ్‌లలో 1645 పరుగులు చేసాడు. వన్డేలలో 8 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేసాడు.

నిరాశ పరచొద్దు:

భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ తన ట్విట్టర్ వేదికగా కోహ్లీని ఓ కోరిక కోరాడు. 'లండన్‌లో సూర్యుడు వెలుగుతున్నాడు. ఈ రోజు భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్. ఇది చాలా పెద్ద మ్యాచ్. దీనికోసం ఓవల్ మైదానంలో ఉన్నాను. విరాట్ సెంచరీ చేయాలని కోరుకుంటున్నా. నన్ను నిరాశ పరచొద్దు' అని కెవిన్ ట్వీటాడు.

షమీని తీసుకోవాలి:

షమీని తీసుకోవాలి:

అక్తర్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో ఈ మ్యాచ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 'ఆస్ట్రేలియా కన్నా భారత్‌కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉంది. జట్టులో మంచి స్పిన్నర్లు, పేసర్లున్నారు. తుది జట్టులోకి మహ్మద్‌ షమీని తీసుకోవాలి. అప్పుడే పేస్‌ విభాగం మరింత బలంగా మారుతుంది' అని అక్తర్‌ పేర్కొన్నాడు.

భారతే ఫెవరెట్‌:

భారతే ఫెవరెట్‌:

'భారత టాపర్డర్‌ రాణిస్తే తిరుగుండదు. ఓపెనర్‌గా రోహిత్‌ చెలరేగితే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. కోహ్లీ కూడా రాణిస్తే భారత విజయం ఖాయం. ఒత్తిడి ఎలా అధిగమించాలి, ఎప్పుడు ఎవరిని బౌలింగ్‌ చేయించాలి అనేదానిపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టి భారత్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదనుకుంటున్నా. ఆస్ట్రేలియాపై ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారతే ఫెవరెట్‌. ఎందుకుంటే ఆసీస్‌ కన్నా మెరుగైన స్పిన్నర్లు భారత్‌కు ఉన్నారు. వారి ఎదుర్కోవడం ఆసీస్ బ్యాట్స్‌మన్‌కు చాలా కష్టం' అని అక్తర్‌ తెలిపారు.

Story first published: Sunday, June 9, 2019, 14:50 [IST]
Other articles published on Jun 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X