న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు ఇదే.. భారత్ నుంచి ఇద్దరు మాత్రమే!!

ICC Cricket World Cup 2019: ICC reveals official Team of the Tournament, Kane Williamson Captain


ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఆదివారం ముగిసింది. ప్రతిష్టాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి కప్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌ టై కావడంతో సూపర్ ఓవర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసారు. ఉత్కంఠ సమరంలో సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.

కెప్టెన్ విలియమ్సన్‌:
టోర్నీలో అన్ని జట్ల నుంచి కొందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టోర్నీమొత్తం విశేషంగా రాణించిన ఆటగాళ్లతో.. ఐసీసీ ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసింది. మొత్తం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీని వికెట్ కీపర్‌గా సెలక్ట్ చేశారు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

రోహిత్, బుమ్రాలకు చోటు:

రోహిత్, బుమ్రాలకు చోటు:

ప్రపంచకప్‌ జట్టులో టీమిండియా నుంచి ఓపెనర్ 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే చోటు దక్కింది. అర్ధ శతకాలు బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కలేదు. వరుస అర్ధ శతకాలు బాదిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ చోటు దక్కించుకున్నాడు. మరో ఓపెనర్‌గా ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరుడు మిచెల్ స్టార్క్, సంచల బౌలర్ జోఫ్రా ఆర్చర్ ప్రధాన బౌలర్లుగా ఎంపికయ్యారు.

పరుగుల వీరులకు మొండిచేయి:

పరుగుల వీరులకు మొండిచేయి:

నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు జట్టులో ఉండడం విశేషం. భారత్, ఆసీస్ నుండి ఇద్దరు, ఇద్దరు ఉన్నారు. ప్రపంచకప్‌లో పరుగుల వీరులు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, బెయిరిస్టో, బాబర్ ఆజామ్ లాంటి వారు చోటు దక్కించుకోలేకపోయారు. ఇక 20 వికెట్లు తీసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా జట్టులోకి ఎంపిక కాలేదు.

ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు:

ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు:

జేసన్ రాయ్ (ఇంగ్లాండ్), రోహిత్ శర్మ (భారత్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లాండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), బెన్‌ స్టోక్స్ (ఇంగ్లాండ్), అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), లుకీ ఫెర్గుసన్ (న్యూజిలాండ్), జస్ప్రిత్ బుమ్రా (భారత్), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్).

Story first published: Monday, July 15, 2019, 18:25 [IST]
Other articles published on Jul 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X