న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీసేనకు మా సత్తా ఏంటో ఈ మ్యాచ్‌లో చూపిస్తాం'

ICC Cricket World Cup 2019 : Match Over India, An Opportunity To Showcase Our Skills : Jason Holder
ICC Cricket world cup 2019: Holder urges West Indies to dig deep in World Cup clash against India

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండిస్-టీమిండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తమ సత్తా ఏంటో చూపించాలని వెస్టిండిస్ ఆటగాళ్లకు కెప్టెన్ జాసన్ హోల్డర్ సూచించాడు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న టీమిండియాపై విజయం సాధించి సెమీస్‌ ఆశలు నిలుపుకోవాలని విండీస్‌ గట్టి పట్టుదలతో ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సెమీస్‌ బెర్తుని ఖాయం చేసుకోవాలని టీమిండియా

సెమీస్‌ బెర్తుని ఖాయం చేసుకోవాలని టీమిండియా

మరోవైపు ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించి సెమీస్‌ బెర్తుని ఖాయం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ సందర్భంగా జాసన్ హోల్డర్ మాట్లాడుతూ "ఈ టోర్నీలో మా జట్టు ఎప్పుడో ఒకసారి మెరుస్తోంది. ఒకరు రాణిస్తే మరొకరు విఫలమవుతున్నారు. మేమంతా సమష్టిగా రాణించాల్సి ఉంది" అని తెలిపాడు.

ఇదే మాకు చివరి అవకాశం

ఇదే మాకు చివరి అవకాశం

"ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లు మమ్మల్ని నిరాశపరిచాయి. ఇదే మాకు చివరి అవకాశం ఉంది. మేమంతా సమష్టిగా రాణించి గెలవాల్సి ఉంది. ఆటగాళ్లను గాయాలు వేధించడం సహజమే. ఇబ్బందులున్నా జట్టు కోసం పోరాడిన మా క్రికెటర్లను చూసి గర్విస్తున్నాం. షైహోప్‌ ఇప్పటి వరకు బాధ్యతాయుతంగా ఆడాడు" అని హోల్డర్ తెలిపాడు.

టోర్నీని సానుకూలంగా ముగించాలని

టోర్నీని సానుకూలంగా ముగించాలని

"హెట్‌ మెయిర్‌, నికోలస్‌ పూరన్‌ అప్పుడుప్పుడు మంచి ఇన్నింగ్సులు ఆడారు. ఎక్కువసేపు క్రీజులో నిలవాల్సిన అవసరం ఉంది. వారిద్దరూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇకపై వారు దేశం కోసం మ్యాచ్‌లను గెలిపించాలి. టీమిండియాతో మ్యాచ్ ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. టోర్నీని సానుకూలంగా ముగించాలని ఆశిస్తున్నాం" అని హోల్డర్ తెలిపాడు.

మ్యాచ్ డిటేల్స్

మ్యాచ్ డిటేల్స్

తేదీ: గురువారం, 27th June 2019

సమయం: 03:00 PM IST

వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

Total: 126

West Indies: 62

India: 59

Tied: 02

N/R: 03

ప్రపంచకప్‌లో హెడ్ టు హెడ్ రికార్డు

Total: 08

West Indies: 03

India: 05

1
43677

{headtohead_cricket_3_8}

Story first published: Thursday, June 27, 2019, 12:20 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X