న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ టోర్నీలో ఇప్పటికీ ఇంగ్లండ్ జట్టే ఫేవరేట్

ICC Cricket World Cup 2019, England vs Australia: Not Australia, England probably still World Cup 2019 favourites says Jason Behrendorff

రెండు వరుస పరాజయాలు చవిచూసినంత మాత్రాన ప్రపంచకప్‌ టైటిల్‌ రేసు నుంచి ఆతిథ్య ఇంగ్లండ్‌ తప్పుకోలేదు. టోర్నీలో ఇప్పటికీ ఇంగ్లండ్‌ కూడా ఫేవరేటే అని ఆస్ట్రేలియా పేసర్‌ జాసన్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలమవడంతో సాధారణ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తక్కువ అంచనవేయలేం:

తక్కువ అంచనవేయలేం:

తాజాగా జాసన్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ మాట్లాడుతూ... 'రెండు వరుస పరాజయాలు చవిచూసినంత మాత్రాన టైటిల్‌ రేసు నుంచి ఇంగ్లండ్‌ తప్పుకోలేదు. ఓటములు చెందినంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనవేయలేం. వరుస విజయాలతో ఆసీస్‌ టైటిల్‌ వేటలో ముందంజలో ఉంది. ప్రపంచకప్‌లో ఆసీస్‌తో పాటు ఇప్పటికీ ఇంగ్లండ్‌ కూడా ఫేవరేట్‌ జట్టే' అని బెహ్రాన్‌డార్ఫ్‌ అభిప్రాయపడ్డాడు.

అవకాశం ఎప్పుడైనా రావచ్చు:

అవకాశం ఎప్పుడైనా రావచ్చు:

'తొలిసారి ఐదు వికెట్లు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. అందులోనూ ప్రపంచకప్‌లో ఈ ఘనత అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌ అరంగేట్రపు మ్యాచ్‌లో శ్రీలంకపై అంతగా రాణించకపోవడంతో నన్ను పక్కకు పెట్టారు. అయితే ఈ సమయంలో కృంగిపోకుండా జట్టులోకి ఎలా తిరిగి రావాలిన ఆలోచించాను. దేశం తరుపున ఆడే అవకాశం ఎప్పుడైనా రావచ్చు, సిద్దంగా ఉండాలని అనుకున్నా. అవకాశం వచ్చింది. నిరూపించుకున్నా' అని బెహ్రాన్‌డార్ఫ్‌ తెలిపారు.

రెండూ గెలవాలి:

రెండూ గెలవాలి:

టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్‌ సునాయాసంగా సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంటుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజా ఓటమితో ఏడు మ్యాచ్‌లాడి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన ఇంగ్లండ్‌.. ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. అయితే ఇంగ్లండ్‌ తమ ఆఖరి రెండు మ్యాచ్‌లనూ బలమైన భారత్‌, న్యూజిలాండ్‌లతో ఆడాల్సి ఉంది. రెండింటిలో ఒక్కటి ఓడినా సెమీస్‌ బెర్త్‌ దక్కే అవకాశాలు తగ్గుతాయి. ఇదే జరిగితే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

Story first published: Thursday, June 27, 2019, 13:44 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X