న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంతగడ్డపై సిరీస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌.. ప్రపంచకప్‌ ముందు హెచ్చరికలు

ICC Cricket World Cup 2019: England banish ghosts from past to rubberstamp WC favourites tag

సొంతగడ్డపై ఇంగ్లండ్‌ జట్టు బెబ్బులిలా రెచ్చిపోతుంది. టార్గెట్‌ ఎంతయినా అలవోకగా ఛేదిస్తూ సునాయాస విజయాలను అందుకుంటోంది. పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే ఒక్క ఓటమి లేకుండా గెలుచుకుంది. నాలుగో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఇంకో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచకప్‌ ముందు అన్ని జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.

బాబర్‌ అజమ్‌ సెంచరీ

టాస్ ఒడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ ఫకర్ జామన్ (57) అర్ధ సెంచరీ చేయగా.. బాబర్‌ అజమ్‌ (115) సెంచరీ చేసాడు. అనంతరం సీనియర్ ప్లేయర్లు మొహమ్మద్ హఫీజ్ (59), షోయబ్ మాలిక్ (41)లు రాణించారు. చివరలో అలీ (17), వసీం (12), కెప్టెన్ సర్ఫరాజ్ (21) బ్యాట్ జులిపించడంతో పాక్ భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ టామ్‌ కరాన్‌ 4 వికెట్లు తీసాడు.

రాయ్‌ శతకం:

రాయ్‌ శతకం:

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు ఇంగ్లండ్‌ ఓపెనర్లు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం జేమ్స్‌ విన్సే (43) పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ అద్భుత ఇన్నింగ్స్ (114) ఆడాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు 107 పరుగులు జత చేసి అవుట్ అయ్యాడు. జో రూట్‌ (36), జోస్‌ బట్లర్‌ (0)లు ఒక బంతి వ్యవధిలో ఔట్‌ అయ్యారు. ఆపై మొయిన్‌ అలీ కూడా డకౌట్‌గా నిష్క్రమించాడు. 5 కీలక వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది.

స్టోక్స్‌ సమయోచిత ఇన్నింగ్స్:

స్టోక్స్‌ సమయోచిత ఇన్నింగ్స్:

ఈ సమయంలో స్టోక్స్‌(71 నాటౌట్‌) సమయోచితంగా బ్యాటింగ్‌ చేసాడు. మరోవైపు టామ్‌ కరాన్‌ (31), ఆదిల్‌ రషీద్‌ (12 నాటౌట్‌)లు అతనికి సహకారం అందించారు. స్టోక్స్‌ చివరి వరకు క్రిజులో ఉండి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు తీర్చాడు. ఇంగ్లండ్ మరో మూడు బంతులు ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడు వన్డేల్లో గెలిచి ఇంగ్లండ్‌ సిరీస్‌ గెలుచుకుంది. పాక్ బౌలర్లలో వసీం రెండు వికెట్లు సాధించాడు. జాసన్‌ రాయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.

ప్రపంచకప్‌ ముందు హెచ్చరికలు:

ప్రపంచకప్‌ ముందు హెచ్చరికలు:

తాజా ప్రదర్శనతో సొంతగడ్డపై తమకు పోటీలేదని ప్రపంచకప్‌ ముందు అన్ని జట్లకు ఇంగ్లండ్‌ హెచ్చరికలు జారీ చేసింది. పాక్ భారీ స్కోర్ చేసినా అలవోకగా ఛేదిస్తూ సునాయాస విజయాలను అందుకుంది. జట్టులోని ప్రతి ఒక్కరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాలంటే ఏ జట్టయినా శ్రమించాల్సిందే.

Story first published: Saturday, May 18, 2019, 14:06 [IST]
Other articles published on May 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X