న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో ఆసీస్‌ శుభారంభం.. అఫ్గాన్‌పై 7 వికెట్లతో విజయం

ICC Cricket World Cup 2019, Afghanistan vs Australia: Warner, Finch stroke Australia beat Afghanistan by seven wickets

2019 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ (3/40), ఆడమ్‌ జంపా (3/60), స్టాయినిస్‌ (2/37)ల ధాటికి అఫ్గాన్‌.. 38.2 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. నజీబుల్లా జాద్రాన్‌ (51; 49 బంతుల్లో 7×4, 2×6) అర్ధ సెంచరీ చేసాడు. అనంతరం ఆసీస్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (89 నాటౌట్‌; 114 బంతుల్లో 8×4), ఆరోన్‌ ఫించ్‌ (66; 49 బంతుల్లో 6×4, 4×6) సమయోచిత ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని ఆసీస్‌ 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ముజీబ్‌తో బౌలింగ్‌ ఆరంభించినా:

ముజీబ్‌తో బౌలింగ్‌ ఆరంభించినా:

208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌లు అఫ్గాన్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. అఫ్గాన్‌ జట్టు స్టార్ స్పిన్నర్ ముజీబ్‌తో బౌలింగ్‌ ఆరంభించినా.. అతనేమీ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఫించ్ మొదటి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. కాసేపు ఆచితూచి ఆడిన ఫించ్‌.. తర్వాత భారీ షాట్లు ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ఫించ్ అర్ధ సెంచరీ చేసాడు.

వార్నర్‌ అర్ధ సెంచరీ:

నిషేధం అనంతరం తొలి మ్యాచ్ ఆడుతున్న వార్నర్‌ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తూ ఫించ్‌కు సహకరించాడు. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబి లాంటి ప్రమాదకర స్పిన్నర్లు కూడా ఆసీస్ బ్యాట్స్‌మన్‌లను ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాక ఫించ్‌ నిష్క్రమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఖవాజా తో కలిసి వార్నర్‌ స్కోరును పెంచాడు. వార్నర్‌ 74 బంతుల్లో అర్ధ సెంచరీ చేసాడు. ఖవాజా (15)ను రషీద్‌ ఔట్‌ చేయగా... లక్ష్యానికి చేరువలో స్మిత్‌ (18)ను ముజీబ్‌ పెవిలియన్‌ చేర్చాడు. మిగతా లాంఛనాన్ని మ్యాక్స్‌వెల్‌ (4 నాటౌట్‌) ఫోర్‌తో ముగించాడు.

 రషీదా మజాకా:

రషీదా మజాకా:

టాస్‌ నెగ్గిన అఫ్గానిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు షహజద్‌ (0), హజ్రతుల్లా (0) డకౌటయ్యారు. ఈ దశలో రహమత్‌ షా (43; 6 ఫోర్లు).. హష్మతుల్లా షాహిది (18)తో ఆదుకున్నాడు. ఐతే స్పిన్నర్ జంపా దెబ్బకు 77 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్‌ గుల్బదిన్‌ (31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నజీబుల్లా జద్రాన్‌ ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్ కుదుటపడింది. అనంతరం రషీద్‌ ఖాన్‌ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో అఫ్గానిస్తాన్‌ స్కోర్ 200 దాటింది.

Story first published: Sunday, June 2, 2019, 9:29 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X